కరోనా వైరస్.. ఇప్పుడు దీని గురించి తప్ప ఇంకా ఏ విషయంపైనా చర్చ జరగనంతగా మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియా అయితే చెప్పేపని లేదు. కరోనా అలా వస్తుంది.. కరోనా ఇలా వస్తుందంటూ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా కరోనా నుంచి తప్పించుకోండని కొందరు సలహాలు ఇస్తున్నారు. మరికొందరు వైద్య నిపుణులు కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్నారు.

 

 

అయితే వీటిలో ఏది నమ్మోలో.. ఏది నమ్మకూడదో అర్థం కాకుండా ఉంది. సామాన్యులు ఈ వీడియోలు చూసి కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దీనికి తోడు లాక్ డౌన్ కావడంతో ప్రజలకు స్మార్ట్ ఫోనై మంచి కాలక్షేపంగా మారింది. అందుకే ఈ సోషల్ మీడియాలో కరోనా గురించిన పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ పేరిట ఓ ఆడియో కలకలం సృష్టించింది. ఈ ఆడియోలో కరోనా తో జరగబోయే ప్రమాదాలను ఆయన బాగా ఎక్కువ చేసిన చెప్పినట్టు కనిపిస్తోంది.

 

 

ఆడియో వింటే ప్రజలు భయభ్రాంతులు కావడం ఖాయమని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఆ ఆడియో నాది కాదంటూ జేడీ లక్ష్మీ నారాయణ ఖండించారు. కరోనా వైరస్ గురించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా తన పేరిట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆడియో తనది కాదని స్పష్టం చేశారు. ఆడియో టేపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను మాట్లాడినట్టుగా అందరూ భావిస్తున్నారని... దీనిని ఎవరూ నమ్మొద్దని జేడీ లక్ష్మీ నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని ఎవరో ఆకతాయిలు కావాలని ఇలా చేసి ఉంటారని ఆయన అంటున్నారు. ఇలాంటి ఆడియో మీ దృష్టికి వచ్చినా నమ్మవద్దని దాన్ని ఇతరులకు పంపవద్దని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: