చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నాడు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అవస్తలు చూసి టిడిపి నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అవస్తలు ఏమిటయ్యా అంటే మోడికి భజన చేయటం. మొన్నటి ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడిని చంద్రబాబు ఎంతలా తిట్టిపోశారో అందరూ చూసిందే. పైగా మోడిని ఓడిస్తానంటూ శపథం చేసి ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో తిరిగాడు. మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి, ములాయం సింగ్ యాదవ్ లాంటి వారితో కలిసి మోడి వ్యతిరేక ప్రచారం కూడా చేశాడు. సరే తర్వాత ఫలితాల్లో ఏమి జరిగిందో అందరూ చూసిందే.

 

చంద్రబాబు ఉద్దేశ్యమేమిటంటే మోడి ఓడిపోతాడని, తాను రెండోసారి సిఎం అవుతానని అనుకున్నాడు. అందుకనే తెగించి బహిరంగంగా మోడిపై నేరుగా యుద్ధమే ప్రకటించాడు. అయితే ఎన్నికల్లో కేంద్రంలో మోడి, ఏపిలో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటి సాధించారు. ఎన్నికల ఫలితాలు  చూసిన తర్వాత చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిందనే చెప్పాలి. కేంద్రంలోను ఏపిలో బద్ధశతృవులే అధికారంలోకి రావటంతో  చంద్రబాబుకు కొద్ది రోజులు దిక్కుతోచలేదు.

 

సరే ఆ తర్వాత మెల్లిగా ఆలోచించుకుని టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపేశాడు. ఆ తర్వాత విశాఖపట్నంలో పార్టీ సమావేశంలో ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసి తప్పు చేశానంటూ చెంపలేసుకున్నారు. మామూలుగా అయితే తప్పును ఒప్పుకోవటం చంద్రబాబు తత్వానికి విరుద్ధం. ఒకవైపు గోడ దెబ్బ మరోవైపు చెంపదెబ్బ లాగ పరిస్దితి తయారవ్వటంతో చేసేది లేక మోడితో సయోధ్యకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

 

జగన్ ను తట్టుకోవటానికి మోడి అండ అవసరమని అర్ధమైన తర్వాత ఒక్కసారిగా భజన మొదలుపెట్టేశారు. పుట్టిన రోజుకు ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పాడు. చివరకు అమిత్ షా బర్త్ డే కు కూడా శుభాకాంక్షలు చెప్పాడు. తాజాగా కొరోనా వైరస్ కారణంగా కేంద్రం ప్రకటించిన రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజి పై రెండు రోజులుగా భజన చేసింది చేసిందే. ప్యాకేజి విషయంలో సంతోషంగా ఉందన్నారు. జనతా కర్ఫ్యూ విధించటం ఎంతో గొప్ప నిర్ణయమన్నారు. వైరస్ నియంత్రణ విషయంలో బిజెపి ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని చెప్పాడు. మోడి చర్యలు ప్రపంచదేశాలకే ఆదర్శమట. ఆకాశమే హద్దుగా మోడిని ప్రశంసలతో ముంచెత్తుతున్న చంద్రబాబును మరి మోడి దయతలచి దగ్గరకు తీస్తారా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: