కొరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ఏపిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతి రోజు  చంద్రబాబునాయుడు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. వైరస్ నియంత్రణకు జగన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చంద్రబాబు మాత్రం ఆరోపణలు చేస్తునే ఉన్నాడు.  సరే జగన్ విషయాన్ని పక్కనపెట్టేద్దాం. ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలో కొరోనా వైరస్ తీవ్రత ఎక్కువుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపిలో 11 కేసులు బయటపడితే తెలంగాణాలో 49 కేసులున్నాయి.

 

నిజానికి ఏపి అయినా తెలంగాణా అయినా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు తెలంగాణా విషయాన్ని మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదు ? ఏపిలో కన్నా తెలంగాణాలోనే కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. అంటే చంద్రబాబు లెక్కల ప్రకారం తెలంగాణా ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేయటం లేదనే కదా అర్దం.

 

తెలుగుదేశంపార్టీకి  చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. మరి జాతీయపార్టీ అంటే తెలంగాణా కూడా వస్తుంది కదా ? పైగా తెలంగాణాలో టిడిపి ప్రతిపక్ష పార్టీ కూడా.  రెండు రాష్ట్రాల్లోను టిడిపి ప్రతిపక్ష పార్టీనే అయినపుడు చంద్రబాబు ఎప్పుడు చూసినా ఏపి గురించే ఎందుకు మాట్లాడుతుంటాడు ? తెలంగాణా గురించి పొరబాటున కూడా ఎందుకు మాట్లాడటం లేదు ? ఎందుకంటే కేసియార్ నిద్రలో కనిపించినా చంద్రబాబుకు చెమటలు పడతాయి కాబట్టే.

 

కేసియార్ గురించి కానీ తెలంగాణా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే ఏమవుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు. ఓటుకునోటు కేసు ఒక్కటి చాలు కేసియార్ కు చంద్రబాబును కంట్రోల్లో పెట్టుకోవటానికి. ఎక్కువ మాట్లాడితే వెంటనే అరెస్టు చేస్తారనే భయంతోనే కేసియార్ గురించి పొరబాటున కూడా చంద్రబాబు నోరెత్తడు. ఒక్క చంద్రబాబనే ఏముంది పుత్రరత్నం నారా లోకేష్ తో పాటు ఏపిలో ని ఏ ఒక్క టిడిపి నేత కూడా నోరెత్తేందుక లేకుండా అందరినీ కట్టడి చేసేశాడు. పైగా కేసియార్ గురించి నోటికొచ్చింది మాట్లాడి మళ్ళీ హైదరాబాద్ లో సేఫ్ గా ఉండగలడా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: