ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికించే అంశం ఉంది అంటే అది కరోనా వైరాసే. అసలు 2020లోకి అడుగు పెట్టామో లేదో.. కష్టాలు ప్రారంభమయ్యాయి. నిజంగానే మనం అంత చచ్చిపోతాం ఏమో అనిపించేలా ఈ కరోనా వైరస్ కసి తీర్చుకుంటుంది. ఇంకా అలాంటి కరోనా వైరస్ కు ఇప్పటికే 24వేలమంది మృతి చెందారు.. 5 లక్షల మంది ప్రాణం ఉంటుందా? పోతుందా అనే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.. ఇలాంటి సంఘటన గతంలో ఎన్నడు జరిగి ఉండదు. 

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి అక్కడ మాయం అయ్యి ప్రపంచమంతా తిరుగుతోంది. ఇంకా ఈ నేపథ్యంలోనే మొదట చైనాను వణికించిన ఈ కరోనా వైరస్ ఆతర్వాత ఇరాన్ లో శవ జాతర చేసింది. ఆతర్వాత ఇటలీలో శివ తాండవం చేసి ఏకంగా 8వేల మందిని తీసుకెళ్లింది.. ఇప్పుడు అగ్ర రాజ్యం అయినా అమెరికాలో చుక్కలు చూపెడుతుంది. అగ్రరాజ్యం అయినా అమెరికా కరోనా కేసుల్లో కూడా అగ్రస్థానానికే చేరింది. 

 

ఎందుకు ? నిర్లక్ష్యం వల్లేనా ? అంటే అవును అనే చెప్పాలి.. చైనా నుండి వచ్చిన వైరస్ చైనీస్ వైరస్ అనే అంటారు. అందుకు అయన ఇట్స్ నాట్ కరోనా వైరస్.. ఇట్స్ చైనీస్ వైరస్ అని ఒకటికి రెండు సార్లు అన్నాడు తప్ప.. ఆ చైనీస్ వైరస్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదు.. ఈ నియంత్రణ చర్యల్లో ట్రంప్ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలయ్యాడు. దీంతో అగ్రరాజ్యం కరోనా వైరస్ లో అగ్ర స్థానానికే చేరింది. 

 

అగ్రరాజ్యం అమెరికాలో 85,612 కరోనా పాజిటివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1301 మంది చనిపోయారు. అదే చైనాలో అయితే 81,340 కేసుల్లో 3,292 మంది మృతి చెందారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ కరోనా అమెరికా మొదటి స్థానంలోకి వెళ్లింది. చైనా రెండో స్థానంలోకి వెళ్ళింది.. ఇంకా ఇటలీ మూడో స్థానంలో కొనసాగుతుంది.. ఇక మన దేశానికీ వస్తే మూడో స్థానానికి చేరింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: