కరోనా కారణంగా ప్రైవేటు ఉద్యోగులు నలిగిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా అనుకోకుండా సెలవులు వచ్చేశాయి. కానీ యాజమాన్యాలు జీతాలు ఇస్తావో ఇయ్యవో తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం అన్ని కంపెనీలు జీతాలు ఇవ్వాల్సిందేనని చెప్పాయి. కానీ దీన్ని ఎంత మంది పాటిస్తారో తెలియదు. కొన్ని కంపెనీలైతే మొదట్లో ప్రైవేటు ఉద్యోగులను ఏదో రకంగా ఆఫీసుకు రప్పించుకుందామని ప్రయత్నించినా ప్రభుత్వాలు సీరియస్ గా ఉండటంతో ఆ పప్పులు ఉడకటం లేదు. 

 


చాలా కంపెనీలు అవకాశం ఉన్నంత వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ కు అవకాశం కల్పించాయి. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు కష్టకాలంలో బంపర్ ఆఫర్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ సంస్థకు సేవలందిస్తున్న ఉద్యోగులకు ఏకంగా 25 శాతం జీతం అధికంగా ఇవ్వాలని నిర్ణయించింది. భారత్ లో పని చేస్తున్న తమ ఉద్యోగులకు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్గుడ్ న్యూస్ వినిపించింది.

 


నెలవారీ శాలరీకి అదనంగా బేసిక్ లో 25 శాతాన్ని అధికంగా చెల్లిస్తామని కాగ్నిజంట్ అనౌన్స్ చేసింది.  ఈ కొత్త పెంపు ఏప్రిల్ నెల నుంచి ఇది అమలవుతుందట. కంపెనీలోని అసోసియేట్ స్థాయి, అంత కంటే కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని వల్ల ఇండియాలో కాగ్నిజెంట్ లో పని చేస్తున్న 2 లక్షల మంది ఉద్యోగుల్లో 1,30,000 మందికి  ప్రయోజనం కలగబోతోంది. 

 

కరోనాతో కాగ్నిజెంట్ కూడా తీవ్రంగా ప్రభావితమైనా సరే.. కష్టకాలంలో అంతా సవ్యంగా జరగాలని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించామని ఆ సంస్థ చెబుతోంది. తమకు ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతే ఫస్ట్ ప్రయారిటీ అని ఆయన తెలిపారు. నిజంగా ఇలా కష్టకాలంలో అదనపు జీతం ఇవ్వడం అంటే మాటలు కాదు కదా.. కాగ్నిజంట్ సూపర్.

మరింత సమాచారం తెలుసుకోండి: