ఆ రక్కసి రక్తదాహాంతో మరిగిపోతుంది.. దానిపేరు కరోనా.. దీనికి కళ్లులేవు, చెవులు లేవు అసలు రూపం లేదు.. కాని కండబలం ఉన్న వాడి నుండి ధనబలం ఉన్న వాడివరకు ఏ భేదం లేకుండా అందరి శ్వాసను జ్యూస్ లాగా పిండేస్తుంది.. ఈ కరోనాకు కర్కోటకులు సైతం గజగజ వణికిపోతున్నారు.. ఇక ప్రపంచదేశాల పరిస్దితి అయితే చెప్పలేని విధంగా మారిపోయింది.. రోజురోజుకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుందే గానీ తగ్గడం లేదు..

 

 

ఇకపోతే కరోనా వైరస్ మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు వదిలిన వారి సంఖ్య 25 వేలు దాటగా, శుక్రవారం వరకూ ఈ మహమ్మారి బారిన పడి 25,066 మంది చనిపోయారని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది యూరోపియన్లేనని వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు యూరప్‌లో కోవిడ్ బారిన పడి 17,314 మంది ప్రాణాలు కోల్పోగా, ఇటలీలో 8165 మంది చనిపోగా... స్పెయిన్‌లో 4858 మంది, చైనాలో 3292 మంది ప్రాణాలు వదిలారు. ఇదిలా ఉండగా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5.60 లక్షల మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. అతి భయంకరంగా విజృంభిస్తున్న ఈ కరోనా చైనాలోనే ఎక్కువగా వ్యాపించిందనుకుంటే, ఆ చైనానే మించి పోయింది అమెరికా..

 

 

ఇక అగ్రరాజ్యంలో 83,338 మందికిపైగా కోవిడ్ బారిన పడగా.. 1321 మంది చనిపోయారు. మరోవైపు లాటిన్ అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 11 వేలు దాటిందని ఏఎఫ్‌పీ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ వైరస్ కారణంగా బ్రిటన్‌లో కరోనా పేషెంట్ల సంఖ్య 14,579 దాటగా.. మృతుల సంఖ్య 759గా నమోదైంది. శుక్రవారం ఒక్కరోజే బ్రిటన్లో 189 మంది కరోనా వల్ల ప్రాణాలు విడిచారు.. ఇకపోతే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాంకాక్ కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం.. ఇదంతా చూస్తుందే అసలు ప్రపంచంలో ముందు ముందు ఎన్ని విపత్తులు సంభవిస్తాయో, ఈ కరోనా దెబ్బకు ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలసిపోతాయో అనే ఆందోళన ప్రజల్లో కలుగుతుందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: