క‌రోనా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌వర‌పెడుతున్న విష‌యం గురించి తెలిసిందే. దేశవ్యాప్తంగా విధించిన కర్ఫ్యూ వలన ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కర్ఫ్యూ నుండి నిత్యావసరాలు, మీడియా, డాక్టర్లకు మినహాయింపు ఇచ్చినా ఆయా అవసరాల నిమిత్తం బయటకి వచ్చిన వారిని కనీస వివరాలు అడగకుండా పోలీసులు బ‌య‌ట‌కు పంపించ‌డం లేదు.  కొన్ని పదుల సంఖ్యలో ఇటువంటి ఘటనలు ప్రతీ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ ఆక‌తాయిలు కొంత మంది ఈ వ్యాధిని పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకోకుండా చాలా తేలిక‌గా తీసుకుంటున్నారు. ఎక్క‌డివారు అక్క‌డే ఇళ్ళ‌కు ప‌రిమిత మ‌వ్వ‌వ‌ల‌సి వ‌స్తుంది. ఎవ‌రికి వారు సెల్ఫ్ క్వారంటీన్‌లో ఉండిపోతున్నారు. పిట్ట‌కూడా బ‌య‌ట‌కు రావాల‌న్నా ఈ మ‌హ‌మ్మారి క‌రోనాకి భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక ఎవ్వ‌రూ కూడా పెద్ద‌గా బ‌య‌ట‌కు రావాల‌న్న ఆలోచ‌న కూడా వారి మైండ్‌లోకి రానివ్వ‌డం లేదు. 

 

ఇక ఈ క‌రోనా వ‌ల్ల‌ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇబ్బంది లేదు. ఐటి సెక్టార్ల‌లో ప‌నిచేసేవాళ్లకు ఇంటి నుండే ఆ ప‌నిని చేసి పంపే సౌక‌ర్యం క‌ల్పించారు. ఇలా అన్ని రంగాల వారికి ఏదో ఒక భద్రత అనేది ఉంది. మరి సినిమా పరిశ్రమ  ఆధారపడి బ్రతుకుతున్న వారి పరిస్థితి కూడా సినిమా హీరోలు ముందుకు వస్తున్నారు. కోట్లు విరాళాలు ప్రకటిస్తున్నారు. అవి ఖజానాకు జమ అయిపోతాయి. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే మ‌రి రోడ్డు మీద రోజూ బిచ్చం ఎత్తుకుని బ్ర‌తికే యాచ‌కుల ప‌రిస్థితి ఏమిటి.

 

ఇదంతా బాగానే ఉంది కానీ అస‌లైన విషాదం ఏమిటంటే ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం షాపులు తీయ‌క‌పోవ‌డం, క‌నీసం టీ కొట్టు కూడా లేక‌పోవ‌డం వ‌ల్ల రోడ్డు మీద ఉండే యాచ‌కుల ప‌రిస్థితి ఏమి కావాలి. భ‌గ‌వంతుడి మీద భారం వేసి వృద్ధులు, చిన్న పిల్ల‌లు, శ‌రీర అవ‌య‌వాలు స‌రిగా లేని వారు ఎంతో మంది గుడి ముందు, బ‌డి ముందు, ఇళ్ళ ముందు భిక్షం ఎత్తుకునే వాళ్ళ‌ను  ఎవ‌రు చూస్తారు. వాళ్ళ ద‌గ్గ‌ర అప్ప‌టి వ‌ర‌కు జ‌మ చేసుకున్న డ‌బ్బులు ఉన్న‌ప్ప‌టికి ఏదో ఒక‌టి వండుకుని తిన‌డానికి కూడా కొంత మంది ద‌గ్గ‌ర దానికి సంబందించిన పాత్ర‌లు కూడా ఉండ‌ని ద‌య‌నీయ ప‌రిస్థితిలో కొంద‌రుంటారు. మ‌రి వారిని ఎవ‌రు ప‌ట్టించుకుంటారు. ఆఖ‌రికి వారి కోస‌మ‌ని పెట్టిన కొన్ని స్వ‌చ్చంద సంస్థ‌లు పెట్టిన ఆహార నిల్వ ఉంచే లాంటి ఫ్రిడ్జ్‌ల‌ను కూడా ప్ర‌జ‌ల ఆరోగ్య రీత్యా ఆలోచించి వాటిని కూడా సీజ్ చేయ‌డం జ‌రిగింది. ఇక ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుని వారికి ఆహారాన్ని అందించే ఏర్ప‌ట్లు చేస్తాన‌ని ఈ రోజు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి తెలిపారు. అయితే అది త్వ‌ర‌గా అమ‌లులోకి వ‌స్తే బావుంటుంది. వారు కూడా మ‌నుషులే వారి ఆక‌లి కేక‌ల‌ను ప‌ట్టించుకునే బాధ్య‌త క‌నీస మాన‌వ‌త్వం అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రికి ఉండాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: