ఏపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఒక పట్టాన ఎవరికి అర్థం కానట్టుగా తయారయ్యాయి.ఏపీలో బలమైన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చాలా ఇస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో జగన్ పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అత్యధికంగా జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, సరికొత్త నిర్ణయాలు, ప్రజల్లో సానుకూలతను పెంచాయి. అదే సమయంలో జగన్ దూకుడు కి బ్రేకులు వేసే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ వస్తోంది. జగన్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పుపడుతూ కొన్నికొన్ని వివాదాస్పద నిర్ణయాలు హైలెట్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తోంది. ఎవరు ఎన్ని రకాలుగా బురదచల్లేందుకు ప్రయత్నించినా, జగన్ మాత్రం తాను ఏ విషయం ఐతే బలంగా నమ్ముతున్నాడో దానిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా డు.

IHG


 తెలుగుదేశం పార్టీ వ్యవహారం కొత్తేమీ కాకపోయినా, జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొద్దిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, సీఎం జగన్ ను టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం వైసీపీ నాయకులకు మింగుడు పడడం లేదు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పాలనపై మాట్లాడారు. జగన్ పరిపాలన ఏడాది పూర్తయిన తర్వాత మాట్లాడతాను అని క్లారిటీ ఇచ్చారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ నాయకులతో పాటు జగన్ చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి తప్పుపట్టారు. అంతేకాదు ఏపీలో నవరత్నాలు పథకం మాత్రమే  సక్రమంగా అమలు అవుతోందని, మిగతా విషయాలన్నీ గందరగోళంగా తయారయ్యాయని ఉండవల్లి కాస్త గట్టిగానే చెప్పారు.

 


 అసలు ఉండవల్లి వ్యవహారం ఇప్పుడే ఇలా ఉంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది వైసీపీ నాయకులకు టెన్షన్ కలిగిస్తోంది. మే నెల తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పాలనపై స్పందించే అవకాశం ఉండడంతో వైసిపి నాయకుల్లో టెన్షన్ మొదలైంది.అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంత అకస్మాత్తుగా ఎందుకు అలా మారిపోయారో అర్థం కాక వైసిపి నాయకులు ఆలోచనలో పడ్డారు. ఒక దశలో ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగినా ఆయన ఆ దిశగా అడుగులు వేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీపై భారీగా విమర్శలు గుప్పించే అవకాశం ఉన్నట్టుగా వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: