కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్దీ విజృంభిస్తోంది. చాలా దేశాలకు చెందిన ప్రజలు హైదరాబాదు వంటి ప్రాంతాల్లో ఉండటంతో పైగా హైదరాబాద్ మెట్రో సిటీ కావడంతో పాజిటివ్ కేసులో ఉన్న కొద్ది బయటపడుతున్నాయి. మరోపక్క ప్రధాని మోడీ లాక్ డౌన్ ప్రకటించిన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తూ వైరస్ విస్తరించడానికి ఎక్కువగా దోహదపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ ప్రారంభంలో ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలా అని అక్కడితో ఆగినా మూడవ దశకు చేరుకుంటే వైరస్ ని చంపడమే లక్ష్యంగా కేసీఆర్ బ్రహ్మాస్త్రం లాంటి ఐడియాలు ఫాలో అవుతున్నారు.

 

ఇప్పటికే మూడో దశలో చేరుకుంటే ఏం చేయాలి అన్న దానిపై కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలను క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా మూడో దశకు వెళితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఆల్రెడీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్లు ఉన్నాయి. కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుకున్న ఇటువంటి పరిస్థితుల్లోనే గాంధీ హాస్పిటల్ ని పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్ గా మార్చేస్తామని చెప్పారు.

 

అంతేకాదు.. గాంధీలో చేయాల్సిన ఆపరేషన్లను ఉస్మానియాకు తరలిస్తామన్న ఆయన.. కింగ్ కోఠి ఆసుపత్రిని సైతం కరోనా చికిత్స కోసం సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకా తీవ్రమైతే ప్రైవేట్ ఆసుపత్రులు మరియు అదే విధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు ప్రతిదానికి ఎదుర్కోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: