కొరోనా వైరస్ సమస్య మామూలు జనాలపై తీవ్ర ప్రభావం చూపకుండా జగన్మోహన్ రెడ్డి మరో సూపర్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో నిత్యావసర సరుకుల కోసం నానా ఇబ్బందులు పడుతున్న జనాలకు జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మేలు జరగటం ఖాయం. ఇంతకీ విషయం ఏమిటంటే లాక్ డౌన్ పరిస్ధితుల్లో ఇంటికి అవసరమైన సరుకులు తెచ్చుకోవటం చాలామందికి ఇబ్బందిగా మారింది. వీళ్ళ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకునే వినియోగదారులు రోడ్లపైకి రాకుండా సరుకులనే  వాళ్ళ ఇళ్ళకు చేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది.

 

వినియోగదారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే జగన్ కల్పించుకుని ఉన్నతాధికారులతో సమావేశమై పరిష్కారాన్ని ఆలోచించారు. ఇందులో నుండే సరుకులను డోర్ డెలవరీ చేయాలని డిసైడ్  చేశారు. వెంటనే సరుకులను అమ్మే షాపులతోను,  ఇప్పటి వరకూ డోర్ డెలివరీ చేస్తున్న స్టార్టప్ కంపెనీలైన స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.

 

ప్రయోగాత్మకంగా ముందుగా విజయవాడలోని డిమార్ట్, రిలయన్స్ మార్ట్, బిగ్ బజార్, స్పెన్సర్, బెస్ట్ ప్రైస్, మోడర్న్ సూసర్ బజార్ లాంటి యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్,  మున్సిపల్ కమీషనర్ చర్చించారు. సూపర్ మార్కెట్ యాజమాన్యాలతో మాట్లాడి పై స్టార్టప్ కంపెనీల ద్వారా డోర్ డెలవరీ చేసేట్లు ఒప్పించారు. సూపర్ మార్కెట్లు వెంటనే వాట్సప్ నెంబర్లు అందించాయి. సరుకులు అవసరమైన వినియోగదారులు వాట్సప్ నెంబర్లలో తమకు కావాల్సిన సరుకుల లిస్ట్ ను ఇచ్చిన 24 గంటల్లో సరుకులు ఇంటికే తెచ్చి డెలివరీ చేస్తారు. కాకపోతే సరుకులు మినిమం వెయ్యి రూపాయల ఖరీదు అయ్యుండాలి.

 

విజయవాడలో మొదటి రెండు రోజుల్లోనే 5 వేల మంది వినియోగదారుల ఇళ్ళకు సరుకులు డోర్ డెలవరీ అయ్యాయి. విశాఖపట్నంలో 8 వేల ఇళ్ళకు సరుకులు అందించారు. కాకినాడు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలులో కూడా సరుకులు డోర్ డెలివరీ అవుతున్నాయి. తొందరలో మరిన్ని పట్టణాల్లో ఇదే పద్దతి అమలు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: