పచ్చమీడియ యాజమాన్యానికి తమ పేపర్ సర్క్యులేషన్ పై అనుమానలు మొదలైనట్లే ఉంది.   ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తున్న కొరోనా వైరస్ దెబ్బ  తెలుగు రాష్ట్రాల్లోని మీడియాపైన కూడా బాగానే పడింది.  కొరోనా కాటు దెబ్బకు ఇప్పటికే ఓ దినపత్రిక మూతపడిపోయింది. దాంతో మిగిలిన ప్రతికల యాజమాన్యాల్లో కూడా టెన్షన్ మొదలైంది.   మిగిలిన పత్రికల యాజమాన్యాల్లో మెజారిటి  మూత వేసేస్తే బాగుంటుందని అనుకుంటున్నా రెండు ప్రధాన పత్రికలు మాత్రం ససేమిరా అంటున్నాయి. దాంతో మిగిలినవి కూడా ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి.

 

సరే ఏ మీడియా సంగతి ఎలాగున్నా పచ్చపత్రికకు మాత్రం టెన్షన్ పీక్స్ కు చేరుకున్నట్లు అనుమానంగా ఉంది.  దినపత్రికలను ముట్టుకుంటే వైరస్ వ్యాపిస్తుందనే ప్రచారం బలంగా జరుగుతోంది. వైరస్ కు దినపత్రికలకు ఎటువంటి సంబంధం లేదని ఎంతమంది ప్రముఖులతో చెప్పించినా జనాల్లో అయితే అనుమానాలు అలాగే ఉండిపోయాయి. దాని ప్రభావం సర్క్యులేషన్ మీద పడినట్లు ప్రచారంలో ఉంది.

 

ఈ నేపధ్యంలోనే పచ్చమీడియా యాజమాన్యానికి సర్క్యులేషన్ తగ్గిపోతోందనే అనుమానం వచ్చినట్లుంది. అందుకనే ప్రింటింగ్ సమయంలోనే తమ పత్రికలపై శానిటైజర్లను చల్లటం మొదలుపెట్టింది. శానిటైజర్లు చల్లటమే కాకుండా చల్లిన విషయం అందరికీ తెలిసేందుకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ప్రింటింగ్ లో ఉన్న పేపర్లపైన శానిటైజర్లు చల్లితే ఏమవుతుంది ?  పేపర్ ప్రింట్ అయిన తర్వాత దాన్ని ప్యాకర్లు ప్యాక్ చేయాలి. తర్వాత కట్టలు కట్టి పార్శిళ్ళను ట్రాన్స్ పోర్టులో వేయాలి.

 

తర్వాత ఆ పేపర్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లకు అందాలి. అక్కడ మళ్ళీ ఏజెంట్ల దగ్గరున్న హ్యాకర్లు లెక్క పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్టలుగా పేర్చుకుని ఖాతాదారులకు అందించాలి. అంటే పేపర్  ప్రింట్ అయిన దగ్గర నుండి ఖాతాదారుడికి చేరేందుకు మధ్యలో ఎన్ని చేతులు మారుతాయో అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. మరి ప్రింటింగ్ సమయంలోనే శానిటైజర్ ను చల్లితే ఖాతాదారుడికి ఏమిటి లాభం ? మొత్తం మీద తమకు సర్క్యులేషన్ తగ్గిపోయే విషయంలో పచ్చమీడియా యాజమాన్యానికి అనుమానం వచ్చినట్లే ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: