కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి ఎప్పటికి చాలా దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం తమ వల్ల కాదు అంటూ చేతులు చేశాయి. కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుడడంతో పాటు కొత్త కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. దాదాపు 190 దేశాల వరకు ఈ కరోనా బారినపడ్డాయి. ఈ అన్ని దేశాల్లో కంటే ఇప్పుడు అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కూడా తాము ఏమి చేయలేము అంటూ చేతులెత్తేసిన  పరిస్థితి కి వచ్చేసింది. కరోనా ధాటికి ఆర్థికంగా బలమైన దేశాలు కూడా విలవిలలాడిపోతున్నాయి. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఈ వైరస్ వ్యాప్తి కాస్త నెమ్మదిగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. 

 

IHG

 

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఉత్తర కొరియాలో మాత్రం ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చాలా సీరియస్ గానే ఈ కరోనా వైరస్ వ్యవహారాన్ని తీసుకున్నారు. ఆ దేశంలో ఎవరికైనా కరోనా వ్యాధి సోకితే కనుక కాల్చి పారేయండి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా  కలకలం రేపుతోంది. కిమ్ సంగతి ప్రపంచ దేశాలకు తెలియంది ఏమి కాదు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. అత్యంత కఠినాత్ముడిగా కిమ్ కు పేరు ఉంది. అనేకమందిని ఉచకోత కోసిన ఘనమైన చరిత్ర కూడా ఆయన సొంతం. ఇక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న తరుణంలో కిమ్ మాత్రం తమ దేశంలో అసలు కరోనా వైరస్ లేదంటూ చెబుతున్నారు. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HOUSE' target='_blank' title='home-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>home</a> ...

 

అసలు మా దేశంలోకి కరోనా వైరస్ రాకుండా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ఆయన ఇప్పటికే ప్రకటించుకున్నారు. అయితే మీడియాలో మాత్రం ఉత్తర కొరియాలో ఉదృతంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉందని, అక్కడ ఇప్పటికే కొంత మంది సైనికులకు ఆ వ్యాధి సోకి మరణించారు అంటూ కథనాలు ప్రచారం చేశాయి. ఇక కిమ్ అయితే కరోనా వైరస్ కు భయపడి ఇప్పటికే దేశ సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. జనాలు ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని గట్టిగానే హెచ్చరికలు చేశారు. ఈ విధానాన్ని ప్రతి దేశం పాటిస్తూనే ఉన్నాయి. అయితే కిమ్ మాత్రం ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినా, ప్రజలు ఎవరైనా రోడ్ల మీద కనిపించినా వెంటనే కాల్చి పారేయండి అంటూ అధికారులకు కు ఆదేశాలు జారీ చేయడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కిమ్ ఎప్పుడూ ఇంతే అంటూ ఆయన తీరుపై మండిపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: