అవును.. నిజం.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా వణికిపోతున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ పుట్టింటిని వదిలేసి అవతారాలు చేస్తుంది. ప్రపంచమంతా వ్యాపించి మనుషులను చంపేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షలమందికి ఈ కరోనా వైరస్ సోకింది. అందులో ఏకంగా 27వేల మంది మృతి చెందారు. 

 

మన భారత్ లోకి ప్రవేశించిన ఈ కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరుకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలందరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ త్వరలో అంతం కానుంది అని సమాచారం. 

 

త్వరలో అంటే ఎప్పుడు? అని అనుకుంటున్నారా? అదేనండి.. ఈ వేసవి కాలంలో కరోనా వైరస్ అంతం కానుంది. ఎందుకు అంటే? దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగటం వల్ల కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతుంది. కొన్ని పరిశోధనలు కూడా ఇవే సమాధానాలు చెప్తున్నాయి.. 

 

నిజానికి కేంద్ర కరోనా పై ముందు నుండే నిగ పెట్టడం వల్ల.. జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భారత్ లో కరోనా వ్యాప్తి కాస్త నెమ్మదిగానే ఉంది.. అయితే ఎలా నెమ్మదించడానికి కారణం ఉష్ణోగ్రతలే కారణం అని కొందరు నిపుణులు చెప్తున్నారు.. అయినప్పటికీ ఈ కరోనా వైరస్ ఎంతకాలం పాటు సజీవంగా ఉంటుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది అని వైద్యులు చెప్తున్నారు. 

 

అయితే ఈ కరోనా వైరస్ ఉష్ణోగ్రతలు తట్టుకోలేక త్వరలోనే అంత అవ్వనుంది అని వైద్యులు ఆశిస్తున్నారు. అయితే ఈ వైరస్ పూర్తిగా అంతం అవ్వాలి అంటే ఇప్పుడు జరుగుతున్న లాక్‌డౌన్‌ ఇంకాస్త పకడ్బందీగా కొనసాగాలి అని.. అప్పుడే ఈ కరోనా వైరస్ బారి నుండి బయట పడగలం అని వైద్యులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: