ఎన్న‌డు లేని విధంగా కొత్త కొత్త వింత జ‌బ్బుల‌న్నీ వ‌స్తున్నాయి. అయితే ఒక‌ప్పుడు ఎంత పెద్ద జ‌బ్బు వ‌చ్చినా స‌రే దానికి ఏదో ఒక మందు ఉండేది. ఎలాగోలా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టేవాళ్ళు. కానీ ఈ క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి మాత్రం ఏ మందు మాకు లేకుండా పోయింది. ఆఖ‌రికి ఎవ‌రికైనా స‌రే ఈ జ‌బ్బు ఉంటే దాని గురించి క‌నీసం తెలియ‌డం కూడా లేదు. కొంత మంది ఈ వ్యాధి సోకిన‌ప్ప‌టికీ దీన్ని బ‌య‌ట పెట్ట‌కుండా కొంత మంది ఎటువంటి ట్రీట్మెంట్‌ని మ‌న‌కు అందిస్తారో అన్న భ‌యంతో చాలా మంది చెప్ప‌కుండా తిరుగుతుంటారు. దాంతో ఈ వ్యాధి వేరే వారికి చాలా ఈజీగా సోకే ప్ర‌మాదం ఉంది. 

 

ఇక ఎలాగైనా స‌రే ఈ మ‌హ‌మ్మారిని ఎలా క‌ట్ట‌డి చేయాల‌ని ఆలోచిస్తున్నారు. కానీ ఎవ్వ‌రికి ఎలా చేయాలో కూడా పాలుపోవ‌డం లేదు. ఎంతో మంది వైద్య నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు ఈ వ్యాధిని నివారించ‌డానికి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ. రోజు రోజుకి ఈ వ్యాధి తీవ్ర‌త పెరిగిపోతుంది. ఇక నేరం చేసిన వాళ్ళ‌ను ప‌ట్టుకోవ‌డానికి వేట కుక్క‌ల్ని ఎలా  ఉప‌యోగిస్తారో అలాగే ఈ వ్యాధిగ్ర‌స్తుల‌ను ప‌ట్టుకోవ‌డానికి  కూడా కుక్క‌ల‌ను ఉప‌యోగిస్తున్నార‌ట‌. పోలీసులు నేరస్తుల‌ను ప‌ట్టుకోవ‌డానికి ఉప‌యోగిస్తుంటారు. అవి వాస‌న‌ను బ‌ట్టి నేర‌స్తులు ఎవ‌ర‌నేది ప‌ట్టుకుంటుంది. ఇప్పుడు బ్రిటన్ లో  ఈ దిశ‌లోనే అడుగులు ముందుకు వేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పై జరుగుతున్న పోరులో జాగిలాలను కూడా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. ‘జాగిలాలు ఏంటి? వ్యాధులను పట్టుకోవడం ఏంటి?’ అని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం అండి  బ్రిటన్ డాక్టర్లు దీన్ని క‌నుగొన్నారు.

 

అయితే వీటిని ‘మెడికల్ డిటెక్షన్ డాగ్స్’గా పిలుస్తార‌ట‌. ఆ దేశంలో మలేరియా, పార్కిన్సన్ సహా అనేక ఇతర వ్యాధులను పసిగట్టడంలో ఈ జాగిలాలు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయ‌ట‌. జాగిలాలకు వాసన చూసి, అందులోని గుట్టును రట్టు చేసే విద్య బాగా తెలుసు. ఇప్పుడు ఈ విద్యనే ఆధారం చేసుకుని ఎవరిలోనైనా కరోనా లక్షణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని తెలుసుకుంటామని మెడికల్ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ఆల్రెడీ దీన్ని ప్ర‌యోగించి స‌క్సెస్ కూడా అయ్యార‌ట‌. ఈ నేపథ్యంలో కొంతమంది మెడికల్ నిపుణులతో ఒక టీంను లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అనే సంస్థ ఏర్పాటు చేసింది .  ఈ సంస్థ ఆరు వారాల్లోగా ‘మెడికల్ డిటెక్షన్ డాగ్స్’కి కొవిడ్-19ని పసిగట్టే. ట్రైనింగ్ ఇస్తుంది. అయితే ఈ జాగిలాలు వ్యాధులను గుర్తించే ట్రైనింగ్ ఇవ్వడం ఈ సంస్థకు ఇదేమి మొద‌టిసారి కాద‌ట‌. గతంలో కేవలం వాసన చూసి వ్యాధులను గుర్తించే విద్యలో జాగిలాలకు ఈ సంస్థ ట్రైనింగ్ ఇచ్చిన అనుభవం ఉంది. ఈ జాగిలాలు  ‘మెడికల్ డిటెక్షన్’లో ఎంత నైపుణ్యం ఉందంటే… మనిషిని వాసన చూసి టెంపరేచర్ రవ్వంత పెరిగినా పట్టేస్తాయి. కరోనా లక్షణాల్లో టెంపరేచర్ పెరగడం కూడా ఒకటన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ను రంగంలోకి దింపడంవల్ల నేషనల్ హెల్త్ సర్వీస్ పై కొంతమేర భారం తగ్గుతుందని మెడికల్ ఎక్స్ పర్టులు అంటున్నారు. అవి టెంప‌రేచ‌ర్ పెరిగిన‌వాళ్ళ‌ను కూడా ఇట్టే ప‌ట్టేస్తాయ‌ట‌.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: