తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కు చేరింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అధిక సంఖ్యలో హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం నగరంలోని కొన్ని ప్రాంతాలను కొవిడ్ - 19 క్వారంటైన్డ్ రెడ్ జోన్ గా ప్రకటించింది. 
 
రెడ్ జోన్లలోని ప్రజలు 14 రోజులపాటు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కొత్తపేట, తుర్కయాంజల్, గచ్చిబౌలి, కోకాపేట, చందానగర్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. 5 ఏరియాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రభుత్వం... కరోనా బాధితుడు నివాసం ఉన్న కిలోమీటర్ పరిధిని కూడా రెడ్ జోన్ గా ప్రకటించింది. 
 
రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇళ్ల వద్దే రేషన్, ఇతర సామాగ్రి అందేలా ఏర్పాట్లు చేస్తోంది. కొంతమంది సిబ్బంది మందులు, ఇతర అవసరాల కోసం వీరికి అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం కరోనా బాధితుడు నివాసం ఉన్న కాలనీ కిలో మీటర్ పరిధిలో ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు చేయనుంది. ఎవరిలోనైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వారిని గాంధీ ఆస్పత్రికి పంపనుంది. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. మరో రెండు, మూడు రోజుల్లో మరికొంతమంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారిలో తెలంగాణకు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులు, వారి కుటుంబీకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: