క‌రోనాపై ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. ఇక మ‌న దేశంలోనూ క‌రోనా కోర‌లు చాస్తోంది. ఇక ప‌ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్ప‌ట ఇవ‌ర‌కు 5,74,834 కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో అగ్ర రాజ్యం అమెరికా అగ్ర‌స్థానంలో ఉంది. ఇట‌లీ రెండో స్థానంలోనూ.. చైనా మూడో స్థానంలో ఉన్నాయి. ఇక మ‌న దేశంలో శుక్ర‌వారం ఏకంగా 116 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మొత్తం శుక్ర‌వారంతో మ‌న దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు 836కు చేరుకున్నాయి. ఇక ఇప్ప‌ట ఇవ‌ర‌కు 19 మంది మృతి చెందారు. ద‌క్షిణ క‌ర్నాట‌క‌లో 8 నెల‌ల చిన్నా రి సైత క‌రోనాకు గురైంది. క‌రోనా చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద వాళ్ల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు.

 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే శుక్ర‌వారం ఒక్క రోజే తెలంగాణ‌లో ఏకంగా 14 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో మొత్తం 59 కేసులు న‌మోదు అయిన‌ట్లు అయ్యింది. హైద‌రాబాద్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోవ‌డంతో ఏకంగా నాలుగు ప్రాంతాల‌ను రెడ్ జోన్ ప్రాంతాలుగా కూడా గుర్తించారు. చందాన‌గ‌ర్‌. . కోకోపేట‌.. తుర్క‌యాంజ‌ల్‌, గ‌చ్చిబౌలి ప్రాంతాల‌ను రెడ్ జోన్లుగా కూడా ప్ర‌క‌టించారు. ఇక తెలంగాణ‌లో ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్యలు తీసుకుంటున్నా గాని క‌రోనా మాత్రం చాప‌కింద నీరులా విస్త‌రిస్తూనే ఉంది. 

 

ఇక ఇటు ఏపీలో శుక్ర‌వారం ఒక్క రోజే రెండు కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.. శుక్ర‌వారం వైజాగ్‌లో ఒక‌టి... ఇటు గుంటూరులో మ‌రో కొత్త కేసు న‌మోదు అయ్యింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 13కు చేరుకుంది. వైజాగ్‌లో ఓ వ్య‌క్తి విదేశాల నుంచి రాగా అత‌డికి క‌రోనా పాజిటివ్ సోకింది. ఇక గుంటూరులో ఓ వ్య‌క్తి మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌గా అత‌డికి కూడా క‌రోనా పాజిటివ్ సోకింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: