ఇపుడు ప్రపంచం అంతా యుద్దం చేస్తుంది.. కరోనా అనే భయంకరమైన రాక్షాసితో అంతులేని పోరాటం.. ఈ కల్లోలంలో ఎందరో కన్ను మూస్తున్నారు.. ఇన్ని దేశాలు.. అంతులేని టెక్నాలజీ..  అంతరిక్షంలో నివాసముండాలని తపిస్తున్న మేధావుల మేధస్సుకు సవాల్‌గా మారిన వైరస్ కరోనాను.. ఇన్నాళ్ల నుండి డెవలప్ చేసుకున్న తెలివి తేటలు, టెక్నాలజీలు, అగ్ర రాజ్యాలు కూడా ఆపలేకపోతున్నాయి.. కాలం వెక్కిరిస్తుంది.. గాయాలు మెలిపెడుతున్నాయి.. ఏంటి ఈ వైరస్ బలం.. కంటికి కనిపించకుండా, ఒంటి మీద కత్తిగాటు పడకుండా ఇన్ని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి..ఈ మరణాలు వైద్యశాస్త్రానికే సవాల్ విసురుతున్నాయి..

 

 

అంతుచిక్కని రోగంతో ఇంకెంత కాలం ఈ పోరాటం.. ఈ రోగాన్ని నయం చేసే వైద్యం ఇంకా ఎన్ని రోజులకు వస్తుందనే ఆలోచన.. మరణంతో పోరాడుతున్న వారిని చూస్తుంటే నిదురపోనివ్వడం లేదు.. ఇకపోతే ఒక్క చోటు నుండి మొదలైన కరోనా, క్రమక్రమంగా ఇప్పటి వరకూ 198 కిపైగా దేశాల్లో విస్తరించింది.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. దీని ప్రభావం వల్ల 300 కోట్లమందికిపైగా ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. అయినా, వైరస్ వల్ల మరణాలు ఆగడం లేదు.. బాధితుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 27,350 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 3వేల మందికి పైగా మంది మృతిచెందారు.

 

 

వైరస్ బారినపడ్డవారిలో 133,355 మంది కోలుకున్నారు. మరో 4,12,549 మంది మంది పరిస్థితి నిలకడగా కొనసాగుతుండగా, 23,500 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు కరోనా జన్మ స్దానమైనా చైనాలలోనే అత్యధికంగా 81వేల కేసులు నమోదు కాగా..  అమెరికా రెండు రోజుల కిందటే ఆ సంఖ్యను దాటేసింది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య అమెరికా లో 104,142 కి చేరింది. శుక్రవారం ఏకంగా 17 వేలకుపైగా కేసులు నమోదయ్యాయంటే అగ్రరాజ్యంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్ధం అవుతుంది.. అలాగే, గడచిన 24 గంటల్లో మరో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 1,695కు చేరుకుంది. గత మూడు రోజుల్లోనే 50వేల కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. ఒకరకంగా అమెరికా ప్రస్తుతం ప్రమాదం అంచులోకి వెళ్లిపోతుంది..

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: