కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క‌రోనా వైర‌స్ ప‌డ్డారంట‌..ఆయ‌న ఇటీవ‌ల ఇట‌లీ వెళ్లొచ్చిన అనంత‌రం చేయించుకున్న ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు క‌రోనా పాజ‌టివ్‌గా తేలిదంట‌.. ఆయ‌న ప్ర‌జ‌ల‌తో, ప్ర‌జాప్ర‌తినిధుల మ‌ధ్య తిరుగుతుండ‌టంతో మ‌రింత మందికి ఈ వ్యాధి సోకుతోంది అంటూ అమిత్‌షాపై  సోష‌ల్ మీడియాలో ఓ విష ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఆయ‌నకు క‌రోనాకు సోకింద‌ని ఏకంగా ఆజ్‌త‌క్ చాన‌ల్‌లో కూడా క‌థ‌నం ప్ర‌చురిత‌మైన‌ట్లుగా ఉండే ఓ స్క్రీన్ షాట్ ఇమేజ్ ఇప్పుడు సోష‌ల్ మీడియా లో తెగ వైర‌ల్ అవుతోంది.  ‘హోం మంత్రి అమిత్ షా కరోనా గుప్పిట్లో ఉన్నారు. గత వారం ఆయన ఇటలీలో పర్యటించారు. భారత్ తిరిగొచ్చిన తర్వాత పరీక్షలు చేయించుకోలేదు. దీంతో మరింత మందికి వైరస్ వ్యాపించి ఉంటుంది’ అనే అర్థం వచ్చేలా అమిత్ షాకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను వైరల్ చేస్తున్నారు. 

 

ముఖ్యంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో ఈ ఇమేజ్ ల‌క్ష‌ల మంది ఖాతాల నుంచి షేర్ అయిన‌ట్లు స‌మాచారం. ఈ ఇమేజ్‌ను ఉద్దేశించి కొంత‌మంది నెటిజిన్లు అస‌లు విష‌యం తెలియ‌క‌ ‘మోదీ గారూ చెప్పండి.. ఇది నిజమేనా’ అని నిలదీస్తున్నారు. అయితే వాస్త‌వానికి  హోం మంత్రి అమిత్ షా క‌రోనా వైర‌స్ బారిన ప‌డ‌లేదు. కేవ‌లం ఇదంతా ఆయ‌న అంటే గిట్ట‌ని కొంత‌మంది టెకీగాళ్ల ప‌ని అని తేలిపోయింది.  ఆయ‌న 100శాతం ఆరోగ్యంతో ఉన్నార‌ని, కేవ‌లం ఆయ‌న‌పై విష ప్ర‌చారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ బీజేపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి.  (మార్చి 27) దేశంలో కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ మంత్రులతో నిర్వ‌హించిన‌ సమీక్షా సమావేశంలో అమిత్‌షా పాల్గొన్నారు. 

దీంతో కొంద‌రిలో నెల‌కొన్న అనుమానాలు ప‌టాపంచ‌ల‌య్యాయి. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదనడానికి ఇదే నిదర్శనం. అంతేకాకుండా ప్రధానితో భేటీ అనంతరం అందుకు సంబంధించిన ఫోటోను ట్వీట్ చేసిన అమిత్ షా.. సామాజిక దూరాన్ని పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వ‌డం విశేషం. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గ్రాఫిక్ కార్డు విష‌యానికి వస్తే  బ్రేక్ యువర్ ఓన్ న్యూస్ అనే వెబ్‌సైట్ ఇలాంటి ఫోటోలను ఎడిటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తోంది. ఇష్టమైన కామెంట్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఆజ్ తక్ న్యూస్ ఛానెల్‌లో అమిత్ షాకు సంబంధించి ఓ వార్త చెబుతుండగా వేసిన ఫోటోను స్క్రీన్‌షాట్ తీసి కింద అమిత్‌షాకు వైర‌స్ సోకిందంటూ కామెంట్లు రాసి దాన్ని సోష‌ల్ మీడియాలో వైర‌లయ్యేలా చేశారు. ఇప్ప‌డు అస‌లు విష‌యం తెలియ‌డంతో  అబ‌ద్ధాన్ని ఎక్కువ‌కాలం క‌ప్పి పుచ్చ‌లేం అన్న నిజం ఎప్పుడు తెలుసుకుంటారో కొంత‌మంది దుర్మార్గులు అంటూ నెటిజ‌న్లు తిట్టి పోస్తున్నారు.

 

Grand Mufti Sulthanul Ulama Kanthapuram ap USTHAD Meets prime minister narendra modi, home minister amith shah on caa, @TOIIndiaNews @GrandMuftiIndia @shkaboobacker @PMOIndia @narendramodi @HMOIndia @AmitShah pic.twitter.com/jUuCFlftoJ

— Nasir Mitharaje Salethur (@NsrSalethur) March 22, 2020 " />

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: