కరోనా వైరస్ మన దేశంలో స్వైరవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది విషయం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా నమోదయింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు మాత్రం తీసిపోకుండా తెలంగాణలో లో మరీ ముఖ్యంగా హైదరాబాదులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువ అయిపోయింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ప్రభుత్వం యొక్క వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మార్చాలని అధికారులను ఆదేశించారు.

 

అయితే ఎంత వైద్య సిబ్బందిని తీసుకునా మరియు ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా ప్రజల్లో నిబద్ధత లేకపోతే ఇక్కడ ఉన్న మహమ్మారిని అరికట్టడం సాధ్యం కాదు. అందుకే కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ లో కూడా అవసరమైతే షూట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా వెనకాడను అని చెప్పాడు. మరీ రోడ్డు మీదకు వచ్చిన దానికే కనబడితే కాల్చి చంపేస్తారా..? అని అందరిలో చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే కేసీఆర్ సంగతి మనందరికీ తెలిసిందే. నిన్న కొంతమంది జర్నలిస్టులు మిలిటరీ ఫోర్సు హైదరాబాద్ లోకి రావడం చూసి కొన్ని వీడియోలను షేర్ చేశారు.

 

భారీ మిలిటరీ బృందం యొక్క కన్సైన్మెంట్ సికింద్రాబాదులోని కంటోన్మెంట్ పరిధిలోని కి వెళ్లడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదు కావడంతో కెసిఆర్ ఇక తప్పని పరిస్థితుల్లో కేంద్రం సహాయంతో మిలిటరీని వీధుల్లోకి తెచ్చాడు అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం అందకపోగా షూట్ అట్ సైట్ ఆర్డర్ ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనబోతున్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: