కరోనా వైరస్ ఎంత దారుణమైన వైరస్ అంటే ప్రధానమంత్రులు సైతం వదలడం లేదు.. అలాంటిది మంత్రులను వదులుతుందా ? అందుకే కరోనా వైరస్ తన పవర్ ఏంటో చూపించింది. ఇంకా అసలు కథలోకి వెళ్తే.. నిన్న సాయింత్రం మనకు ఓ సంచలన వార్త తెలిసింది. అది ఏంటి అంటే బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని తెలిసి అందరూ షాక్ కి గురయ్యారు. 

 

అయితే ఆ ప్రైమ్ మినిస్టర్ ఏ మాత్రం బాధపడకుండా.. భయపడకుండా.. ట్విట్టర్ ద్వారా అతనికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని.. ఇంట్లోనే ఉండి దేశాన్ని కాపాడుకుంట అని.. అందరూ జాగ్రత్తగా ఉండాలి అని.. కరోనా నుండి బయటపడటం కోసం మనం అందరం కలిసి శ్రమిద్దాం అని అయన చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ నేపథ్యంలోనే బ్రిటన్ లో ప్రధానమంత్రినే కాదు అతని మంత్రిని కూడా ఈ కరోనా వైరస్ వదలలేదు. 

 

కరోనా వైరస్ వచ్చింది మాములు వ్యక్తి కాదు ఏకంగా బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రికే వచ్చింది. ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్‌ హాన్‌కాక్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అయితే అతనికి పాజిటివ్ రావడంపై ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు అతను ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండటంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోనే ఉండి ఇంటి వద్దనుంచే పనిచేస్తున్నానని మ్యాట్‌ ట్విట్ వేదికగా పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: