విదేశాల నుండి వచ్చిన వారి వల్లే కొరోనా వైరస్ పెరిగిపోతోంది. ఇప్పటి వరకూ ఏపిలో నమోదైన 12 కేసులు కూడా కేవలం విదేశాల నుండి వచ్చిన వారే. అంటే విదేశాల నుండి వచ్చిన వారి విషయంలో కుటుంబ సభ్యులు కానీ ఇతర జనాలు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్ధమైపోతోంది.  విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా వైరస్ బాగా పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఏపీ లో బయటపడిన 12 కేసులూ కేవలం విదేశాల నుంచి వచ్చిన వారే కావటం గమనార్హం.

 

అందుకనే విదేశీయుల విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంటోంది. కానీ వాళ్ళు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వంతో పాటు స్ధానికుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అందుకనే ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చిన వారిని ముందుగా ఐసోలేషన్ వార్డులు లేకపోతే క్వారంటైన్ సెంటర్లో  ఉంచి చికిత్స చేయిస్తోంది.

 

కొరోనావైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా విదేశాల నుంచి వచ్చిన వారినుండి ప్రభుత్వానికి సమస్యలు తప్పట్లేదు.

 

కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న జాబితాలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న జాబితాలతో జాబితాలు పోల్చి చూసినప్పుడు 453 మంది మిస్ అయినట్లు అర్థమైంది.  రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేయిస్తున్న ఇంటింటి సర్వే లో కూడా 221 మంది విదేశీయులు అడ్రస్ కనపడటం లేదు. అయితే విదేశాల నుంచి జిల్లాకు వచ్చి మళ్లీ తిరిగి విదేశాలకు 31 మంది వెళ్లిపోయినట్లు కన్ఫర్మ్ అయింది. అలాగే మరో 81 మంది ఇతర రాష్ట్రాలకు వెళిపోతే, మరో 20 మంది ఇతర జిల్లాలకు వెళ్ళిపోయినట్లు తెలిసింది.

 

వందల మంది విదేశాల నుండి వచ్చి అడ్రస్ లేకుండా తప్పించుకు తిరుగుతున్నా  వాళ్ళ కుటుంబసభ్యులు ఇంత బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.  ఇదే సందర్భంగా  విదేశాల నుండి వచ్చి హోం క్వారంటైన్ సెంటర్లలో ఉంటున్న ఇద్దరు బాధితులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా మాయమైపోయారు. దాంతో వాళ్ళిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెతుకుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: