పేరుకు అగ్రరాజ్యమైనా కొరోన వైరస్ ను నియంత్రించడంలో అగ్రరాజ్యం అమెరికా చేతులెత్తేసిందా ? అమెరికాలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే విధమైన అనుమానం పెరిగిపోతోంది. దశాబ్దాల పాటు ప్రపంచంలో ఇంతకాలం తాను శత్రువుగా భావించిన దేశాలను నానా ఇబ్బందులు పెడుతున్న అమెరికా ప్రస్తుతం కంటికి కనిపించని శత్రు దెబ్బకు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా మొత్తం మీద దాదాపు లక్ష మందికిపైగా కొరోనా వైరస్ బాధితులున్నారు ఇందులో 1400 మంది మరణించినట్లు సమాచారం.

 

 కొరోనా వైరస్ దెబ్బకు న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూ జెర్సీ, వాషింగ్టన్ తదితర రాష్ట్రాల అన్నీ కూడా ఒక్కసారిగా చిగురుటాకులాగ వణికిపోతున్నాయి.  కొలంబియా యూనివర్సిటీ హాస్పిటల్లో  కూడా చాలామంది కొరోనా వైరస్ సోకినవారున్నారు. వారంత తమ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నారు.  తమ విశ్వవిద్యాలయంలో పని చేసే  4,500 మంది సిబ్బంది లో 1200 మందికి ఈ వైరస్ సోకిందని ప్రొఫెసర్ కుమార్ చెప్పారు. వీరిలో కూడా 25 శాతం మంది ఐసీయూలో చేరినట్లు ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

 

తమ విశ్వవిద్యాలయం ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందే కొరోనా వైరస్ తో  ఇబ్బందులు పడుతుంటే ఇక బయట నుండి వచ్చే రోగులకు తాము చికిత్స చేయలేకపోతున్నామని కుమార్ చెప్పటమే అక్కడి తీవ్రతను చెబుతోంది. ఈ కారణంగానే బయట నుండి వచ్చే బాధితులకు చికిత్స చేయలేకపోతున్నట్లు చెప్పారు. ఇందుకనే బయట రోగులను తాము తమ ఆసుపత్రిలో చేర్చుకోవటం లేదని కూడా స్పష్టం చేశారు.

 

దాదాపు ఇదే పరిస్దితి కాలిఫోర్నియా, వాషింగ్టన్ న్యూయార్క్ లో కూడా కనబడుతోంది. వైరస్ దెబ్బకు ఒకవైపు ఐటి పరిశ్రమలు, సేవా రంగాలతో పాటు ఉత్పత్తి రంగం కూడా కుదేలైపోతోంది. దాంతో జనాల్లో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఇటువంటి సమస్య రాకూడదు. కానీ ఎందుకు వచ్చిందంటే శతృవు కంటికి కనిపించటం లేదు కాబట్టే. మందు కూడా లేని వైరస్ కావటంతో నియంత్రణ చేతకాక చివరకు చేతులెత్తేసినట్లే అనుమానంగా ఉంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: