క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే పేరు మోత మోగిపోతోంది. చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 27,250 మంది ప్రాణాలు కోల్పోగా, 5.94 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ప్ర‌స్తుతం అమెరికాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఇప్ప‌టికే వైరస్‌ బాధితుల సంఖ్య లక్షను దాటింది. నిన్న ఒక్కరోజే 16 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1300 మంది మృత్యువాత పడ్డారు. 

 

మాయదారి కరోనా వైరస్ మహమ్మారిని తప్పించుకోవాలంటే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఎందుకంటే క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ లేదు. ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే దీనికి మార్గం అని నిపుణులు చెబుతున్నారు. అయితే గొడుగుతో కూడా క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చు. గొడుగు ఏంటి.. క‌రోనా ఏంటి..? ఈ రెండిటికి సంబంధం ఏంటి..? అన్న ప్ర‌శ్నులు మీకు రావ‌చ్చు. మీరు విన్న‌ది.. నిజ‌మే! సామాజిక దూరం మనం పాటించాలన్నా, ఇతరులు పాటించేలా చెయ్యాలన్నా.. మన దగ్గర గొడుగు ఉంటే.. అది సాధ్యమవుతుంది. 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ తిలిపిన స‌మాచారం ప్ర‌కారం.. సామాజిక దూరంలో భాగంగా ప్రతి ఒక్క‌రూ మ‌రో వ్య‌క్తికి క‌నీసం మూడు అడుగుల దూరం పాటించాలి. అయ‌తే మ‌నం ఒక్క‌రిమే పాటిస్తే స‌రిపోదు క‌దా.. ప్ర‌తి ఒక్క‌రూ పాటించాలి. లేక‌పోతే ఉప‌యోగం ఉండ‌దు. అదే మ‌న ద‌గ్గ‌ర గొడుగు ఉంటే మన చుట్టూ ఉన్నవారు మన దరిచేరేందుకు వీలవ్వదు. గొడుగు అడ్డు వస్తుంది. తద్వారా సామాజిక దూరం కొంతైనా పాటించేందుకు వీలవుతుంది.  

 

అలాగే ఎవ‌రైనా ప‌క్క‌నివారు గబుక్కున తుమ్మినా, దగ్గినా మీరు గొడుగును అడ్డుపెట్టుకోవచ్చు. తద్వారా ఎదుటివారి తుంపర్లు మీపై పడకుండా ఉంటాయి. అలా ఎంతో కొంత గొడుగు వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. అయితే గొడుగుపై క‌రోనా వైర‌స్ ఉంటుంది క‌దా అంటే.. బ‌య‌ట నుంచి ఇంటికి వెళ్లాక గొడుగును మ‌డిచి ప‌క్క‌న పెట్ట‌కుండా.. దాన్ని  సబ్బుతో లేదా శానిటైజర్‌తో క్లీన్ చేయాలి. ఆ తర్వాత అది ఆరేవ‌ర‌కు ఎండలో ఆర‌బెడ‌తే స‌రిపోతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: