క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అతాల‌కుత‌లం చేస్తోంది. అన్నిదేశాల‌ను కోలుకోలేని దెబ్బ‌తీస్తోంది. ఇప్ప‌టికే సుమారు 27వేల మందికిపైగా ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించింది. 5ల‌క్ష‌ల మందికిపైగా దీని బారిన‌ప‌డ్డారు. ఇంకా రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే.. చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా క‌రోనా వైర‌స్ పుట్టింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ చివ‌ర‌లో దీనిని గుర్తించారు. అయితే.. దీని బారి నుంచి వుహాన్‌ న‌గ‌రం తొంద‌ర‌లోనే కోలుకుంది. ఇక ఇప్పుడు మిగ‌తా దేశాల‌న్నింటిలో క‌రానా బీభ‌త్సం సృష్టిస్తోంది. అమెరికా, ఇట‌లీ, స్పెయిన్‌, ఇరాన్‌, ద‌క్షిణ కొరియా, యూకే.. భార‌త్‌, పాకిస్తాన్‌.. ఇలా 190దేశాల్లో ఈ వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. వైర‌స్ పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఇంత తొంద‌ర‌గా కోలుకోవ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. ఇప్ప‌టికీ ఈ వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ కూడా లేదు. అలాంట‌ప్పుడు ప్ర‌పంచ‌మంతా అల్లాడుతుంటే.. చైనా మాత్రం ఇంత త్వ‌ర‌గా ఎలా రివ‌క‌వ‌రీ అయింద‌న్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు.. ఇక్క‌డే అంత‌ర్జాతీయంగా అనేక ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మవుతున్నాయి. 

 

ఇది క‌చ్చితంగా చైనా సృష్టించిన వైర‌సేన‌నే అనుమానాలు రోజురోజుకూ బ‌ల‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. క‌రోనాను చైనా వైర‌స్ అంటూ మండిప‌డ్డారు. తాజాగా.. చైనా డైలీకి సంబంధించిన పాత‌ విష‌యం ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో సుమారు ఐదువంద‌ల ఎక‌రాల్లో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీలో ఏకంగా 1500పైగా వైర‌స్‌ల‌పై ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయ‌న్న‌ది విష‌యం. అయితే.. ఈ న‌గ‌రం కేంద్రంగానే క‌రోనా వైర‌స్ పుట్టుకురావ‌డంతో ఇది క‌చ్చితంగా చైనా ప‌నేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచంలోనే బ‌ల‌మైన ఆర్థిక శ‌క్తిగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న చైనా.. ఎంత‌టి దారుణానికైనా ఒడిగ‌డుతుంద‌ని.. అందులో భాగంగానే క‌రోనా వైర‌స్‌ను సృష్టించింద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. 

 

ఇప్పుడికి స‌రిహ‌ద్దుల్లోకి వెళ్లి యుద్ధం చేయాల్సిన అవ‌సరం లేద‌ని, కేవ‌లం వైర‌స్‌ల‌ను సృష్టించి శ‌త్రుదేశాల‌ను నాశ‌నం చేయ‌వ‌చ్చున‌ని.. ఇప్పుడు క‌రోనా వైర‌స్‌తో చైనా బ‌యోత్పాతం సృష్టిస్తోంద‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు ఆరోపిస్తున్నారు. ఆ వైర‌స్‌ల‌కు సంబంధించి త‌మ‌వ‌ద్ద‌నే వ్యాక్సిన్‌ల‌ను దాచుకుని ఇత‌ర దేశాల‌ను నాశ‌నం చేయాల‌నే దురుద్దేశంతోనే చైనా ఇంత‌టి దారుణానికి ఒడిగ‌డుతోంద‌ని, కేవ‌లం తాను ఆర్థిక శ‌క్తిగా ఎదిగేందుకు చేస్తున్న కుట్ర‌లో భాగ‌మే క‌రోనా వైర‌స్ అని మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇత‌ర దేశాల్లో చైనా వ‌స్తువుల‌ను నిషేధించాల‌నే డిమాండ్ కూడా క్ర‌మంగా బ‌ల‌ప‌డుతోంది. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఇలాంటి విష‌యాల‌ను ఖండిస్తోంది. వైర‌స్‌ల‌కు ప్రాంతాలు, స‌రిహ‌ద్దులు.. ఉండ‌వ‌నీ.. అది ప్ర‌కృతి సృష్టించిన వైర‌స్ అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: