ప్రపంచాన్ని మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తుంది కరోనా వైరస్. అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయి. చైనా నుంచి ఈ వచ్చిన భూతం..ప్రపంచ దేశాలకు పాకుతోంది. వేలాది మంది బలవతున్నారు. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని వేలల్లో ఈ వ్యాధితో చనిపోయారు. ఎంత వరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ నిర్దారణ కాలేదు.


ఇప్పటికే భారతదేశ మంతా లాక్ డౌన్. ఎక్కడి వారెక్కడ ఉండాలని ప్రభుత్వాలు సూచన.  స్టేట్ ఎట్ హోమ్ అంటున్నాయి పాలకులు. కరోనా వ్యాపిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 21 రోజుల పాటు ఇంటిలోనే ఉండిపోవాలని కోరారు. దీంతో చాలా మంది ఇంటి వద్దనే ఉండిపోతున్నారు.

 

దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు రోజు రోజుకి ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్యా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో ఎనిమిది వందల పైగా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దేశంలో ఇప్పటికే 13 మంది చనిపోయారు. ఇలాగే ఈ వ్యాధి వ్యాప్తిస్తే దేశంలో రానున్న రోజుల్లో ఐదు లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకే ప్రభావం ఎక్కువగా ఉంది. 

 

మన దేశంలో వైద్య సౌకర్యం చాలా తక్కువగా ఉంది. ఈ వ్యాధి దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందితే అనేక వేల మంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన ప్రధాని దేశంలో జనతా కర్ఫ్యూని విధించారు. అనంతరం దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశంలో లాక్ డౌన్ విధించారు. అయినా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతూనే ఉన్నాయి.


ఇకనైనా అధికారులు చెప్పే విషయాలను పాటిస్తే కొంత వరకు అయినా ఈ వ్యాధిని నిరోధించవచ్చు. గృహ స్వీయ నిర్బంధన పాటించడం వలన కొంత వరకు వ్యాధిని అరికట్ట వచ్చు. రోజుకు పది, పదిహేను సార్లు చేతులు కడుకోవాలి. ఇకనైనా పరిస్థితి చేయి దాటాక ముందే భారతీయుడు మెల్కో ఈ వ్యాధి నిర్ములనుకు అడ్డుకట్ట వేయు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: