కరోనా సృష్టిస్తున్న విళయతాండవం అంతా ఇంతా కాదు.  ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ భయం గుప్పిట్లో బతుకుతుంది.  చైనా లోని పుహాన్ లోని పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు మాన సంబంధాలు కూడా ప్రశ్నార్థకంగా మారిపోయాయి.  మనిషికి మనిషి ఇప్పుడు సామాజిక దూరం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కరోనా సోకిన వారిని ఓ పెద్ద భూతం ఆవహించిందా అన్నట్టు చూస్తున్నారు.  కొన్ని చోట్ల కరోనా వచ్చిన వారిని తమ బంధువులకు కూడా చూపించకుండా ఖననం చేస్తున్నారు.  తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో  దారుణ ఘటన జరిగింది. జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన కోసరి రాజవ్వ (56) గురువారం సాయంత్రం మృతి చెందింది. బంధువులు, శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.

 

రోజు రోజు కీ పెరిగిపోతున్న  కరోనా భయంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను కడసారి చూసేందుకు రాలేదు. గ్రామస్థులూ సరేసరి. దీంతో అంత్యక్రియలు నిర్వహించడం ఎలానో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు.  అంతే కాదు ఆమె పాడె మోసేందుకు కూడా ఎవ్వరు రాలేదు. దాంతో ఇక లాభం లేదనుకొని  చెత్త ఎత్తుకెల్లే రిక్షాలో మృత దేహాన్ని తీసుకొని స్మశానవాటికకు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.  మరోవైపు దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  

 

నేడు కరోనా గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు సినీ, రాజకియ, క్రీడారంగానికి చెందిన వారు కృషి చేస్తున్నారు.  కరోనా విస్తరణ జరగకుండా ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ లో భాగంగా ఇంటిపట్టున ఉండాలని అంటున్నారు.  ఈ నేనథ్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇంటి పట్టున ఉంటూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తే బాగుంటుంది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: