తెలుగుదేశంపార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పరిస్ధితి రోజురోజుకు మరీ విచిత్రంగా తయారవుతోంది. ఏపిలో ఎప్పుడు సమస్యలు వచ్చినా వెంటనే హైదరాబాద్ కు వచ్చేస్తున్నాడు. హైదరాబాద్ లోని తనింట్లో కూర్చుని ఏపిలో జగన్మోహన్ రెడ్డి సరిగా చేయటం లేదని, ప్రభుత్వం ఫెయిలయ్యిందంటూ నానా యాగీ చేయటం అలవాటైపోయింది. ఇపుడు కూడా అదే పద్దతిని పాటిస్తున్నాడు. హైదరాబాద్ లో కూర్చుని జగన్ పై రాళ్ళేస్తున్నాడు.

 

కొరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవట. విదేశాల నుండి ఎంతమంది వచ్చారో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవంటున్నాడు. సరే ఇలాంటి ఆరోపణలు నోటికొచ్చినట్లు చేసేస్తున్నాడు ప్రతిరోజు. కానీ విషయం ఏమిటంటే వైరస్ నియంత్రణకు జగన్ ప్రభుత్వం బాగా చేస్తోంది. ఇప్పటి వరకూ బయటపడిన 11 కేసులు కూడా విదేశాల నుండి వచ్చిన వాళ్ళవే అన్న విషయం గమనించాలి. అంటే వాళ్ళు ఏపిలోకి రావటమే వైరస్ ను తగిలించుకుని వచ్చిన వాళ్ళన్నమాట.

 

విదేశాల నుండి వచ్చిన వాళ్ళ వివరాలు ప్రభుత్వం దగ్గర లేకపోతే 11 కేసులు ఎలా బయటపడ్డాయి. కాబట్టి చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోతోంది.  మొన్నటికి మొన్న ఏపిలో భారీ వరదలు, వర్షాలు కురిసినపుడు కూడా హైదరాబాద్ లోనే కూర్చుని నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. వరద, వర్షాల సమస్య తగ్గిన తర్వాత విజయవాడకు వచ్చి బాధితులను పరామర్శలంటూ పెద్ద డ్రామాలాడాడు.

 

జగన్ గురించి ఇన్ని ఆరోపణలు చేస్తున్న  ఇదే చంద్రబాబు తెలంగాణాలో బయటపడిన 49 కేసుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు ? ఏపిలో బయటపడిన 11 కేసులతో పోల్చుకుంటే తెలంగాణాలో బయటపడిన కేసులు 49 అంటే సమస్య చాలా ఎక్కువగా ఉన్నట్లే కదా ? మరి ఇంత ఎక్కువగా సమస్య ఉన్న రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడటం లేదు ? కేసియార్ ప్రభుత్వం పనితీరు సరిగా లేదు కాబట్టే కేసులు పెరిగిపోతున్నాయని ఎందుకు  చెప్పటం లేదు ? బొంద పెడతాడని భయమా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: