ప్రతి మనిషికి మరణం తప్పదు.. కానీ ఆ మరణం.. కరోనా వైరస్‌తో నరకం అనుభవిస్తూ మరణిస్తున్న వారిని చూస్తుంటే.. ఇంత భయంకరంగా ఉండవద్దనిపిస్తుంది.. ఇంతకాలం ఒంటరిగా పుట్టాము.. ఒంటరిగా పోతాం అని అనుకున్న మాటలు ఇప్పుడు అక్షర సత్యాలవుతున్నాయి.. లోకం మొత్తం ఒక్కటే బాధ.. ఇన్నాళ్లు ప్రతి మనిషికి కష్టసుఖాలు వేరు వేరుగా ఉండేవి.. కానీ ఇప్పుడు మాత్రం అందరిది ఒక్కటే వేదన.. కరోనా పెట్టిస్తున్న కన్నీటి వేదన.. రానున్న మూడునాలుగు నెలల్లో ఎవరు బ్రతుకుతారో, ఎవరు చస్తారో తెలియని ఆవేదన..

 

 

ఇకపోతే ఈ కరోనా సోకిన ఎందరో అభాగ్యులు ఐసోలేషన్‌ వార్డుల్లో ఒంటరిగా గడుపుతున్నారు. మరికొందరు అయినవాళ్ల కడసారి చూపునకు కూడా నోచుకోకుండా మరణిస్తున్నారు. ఎందరో తమవారికి ఫోన్‌ చేసి, కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలాంటి వారి పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తే జీవితమంటే విరక్తి కలుగుతుంది.. మనసు బాధతో కృంగి పోతుంది.. ఇలాంటి పరిస్దితిని ఒక డాక్టర్‌గా నేను ప్రత్యక్షంగా చూస్తున్న.. మరి ప్రజల్లారా మీకు ఇలాంటి పరిస్దితి అవసరమా, దారుణమైన చావు కావాలా.. వద్దనుకుంటే సామాజిక దూరం పాటించండి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించండి.. అని న్యూయార్క్‌ నగరానికి చెందిన భారతీయ సంతతి వైద్యురాలు డాక్టర్‌ కామినీ దూబే విజ్ఞప్తి చేస్తున్నారు.

 

 

న్యూయార్క్‌ వర్సిటీ లాంగోన్‌ మెడికల్‌ సెంటర్‌, బెలెవ్యూ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆమె.. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. కాగా కేవలం కరోనా అనే ఒక వ్యాధితో ఇంత మంది చనిపోవడం తానెప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు ఇకపోతే కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసే సమయంలో మాకు కూడా ప్రమాదం పోంచి ఉంది.. ఇలా అమరులు అవ్వడానికి మేం వైద్య వృత్తిలోకి అడుగు పెట్టలేదు. మేం ఉన్నది యుద్ధభూమిలో కాదు. కానీ, తప్పదు. ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్నది పెద్ద విపత్తు.

 

 

ఇక చికిత్స అందించే పరికరాలు, వెంటిలేటర్లు వంటివి పరిమితంగా ఉన్నప్పుడు.. రోగుల సంఖ్య పెరిగితే ఎలా.. ఉన్న వెంటిలేటర్లను ఎంతమందికని సర్దాలి.. ఇంటికి వెళ్లినా ఇవే ఆలోచనలు. అయినా.. మేము చికిత్సను అందించేందుకు సిద్ధం. అయితే ప్రజలు కూడా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో సహకరించాలి... ఇందులో భాగంగా స్వీయ నిర్బంధాన్ని, సామాజిక దూరాన్ని పాటించాలి అని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.. కావునా ప్రజల్లారా పరిస్దితిని అర్ధం చేసుకోండి.. మనందరం ప్రమాదంలో ఉన్నాం.. అందుకే అధికారులు చెప్పినట్లుగా విందాం.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: