దేశం మొత్తం శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ గడువును పెంచిన విషయం తెలిసిందే. దీని వల్ల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. తర్వాత కూడా ఎప్పుడు ఇళ్ల నుండి బయటకు వస్తారో తెలియదు. అందుకే తమకు కావలసిన నిత్యావసర సరుకులన్నిటినీ ముందే కొని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తొందర పడకపోతే, తర్వాత ఆ వస్తువులు దొరకవేమోనని కంగారు పడుతున్నారు. ముందు జాగ్రత్తగా ఎంత కొనగలిగితే అంత కొనేస్తున్నారు. దీనినే ప్యానిక్ బైయింగ్ అంటారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్యానిక్ బైయింగ్ బాగా ఎక్కువయ్యింది. దీని ప్రభావం వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పైన కూడా పడింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన కూడా గ్యాస్ బండల డిమాండ్ పెరిగేలా చేసింది.

 

 

మున్ముందు సిలిండర్లు దొరకవేమో అని, చాలా మంది ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దాని వల్ల గ్యాస్ బండల కొరత ఏర్పడింది. అందరూ రెండేసి, మూడేసి బండలు బుక్ చేస్తుండటంతో... గ్యాస్ కంపెనీలకు షాక్ తగిలినట్లైంది. మాములుగా హైదరాబాద్‌లో 2 లక్షల సిలిండర్లు బుక్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా మూడున్నర లక్షలు బుక్ చేసుకున్నారు. అందుకే గ్యాస్ కంపెనీలు ఇప్పుడు డబుల్ గ్యాస్ బుకింగ్స్ ను నిషేధించాయి. సాధారణంగా ఒక బండ బుక్ చేసుకున్న తర్వాత రెండోది కావాలంటే 24 గంటల తర్వాత బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఓ వ్యక్తి ఒక గ్యాస్ బండ బుక్ చేస్తే,  తర్వాత 14 రోజుల వరకూ ఆ వ్యక్తి మరో సిలిండర్ బుక్ చేసుకునే ఛాన్స్ లేదు.  ఈ రూల్ ను భారత్, hp గ్యాస్ కంపెనీలు ముందుకు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇండేన్ గ్యాస్ కంపెనీ కూడా ఇదే బాటలోకి దిగింది. ఇలాంటి రూల్ పెడితేనే,  గ్యాస్ బండలు అందరికీ  అందుబాటులో ఉంటాయని గ్యాస్ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple          

మరింత సమాచారం తెలుసుకోండి: