ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు విషయాలు, కథనాలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో కరోనా భయాందోళన నెలకొన్న నేపథ్యంలో కొందరు అవాస్తవాలను నమ్మడంతో పాటు వాటిని ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కరోనా గురించి వచ్చినన్ని వదంతులు దేని గురించి రాలేదు. 

 

💥 ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న  కొన్ని తప్పుడు విషయాలు..💥

1.అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ
2.J D లక్ష్మీనారాయణ గారి వాయిస్
3.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు
4. jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి
5.డాక్టర్ దంపతుల మరణం
6.రష్యా 500 సింహాలు రోడ్లపై వడలడడం
7.కరోనా వైరస్ కు dr గుప్త మందు
8.రోడ్ల పైన పడిఉన్న దేహాలు
9.dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన
10.COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు
11.ఆవుకు పుట్టిన మనిషి
12.మోడీ గారి 1000 GB  ఫ్రీ..
13.బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు...

ఈ ఊర్లో, ఆ ఊర్లో కరోనా అంటూ వదంతులు.... ఇలాంటివి మన ఫోనులో మరెన్నో..

ఇలాంటి తప్పుడు వార్తల మధ్య "వాస్తవాలు" నలిగిపోతున్నాయి.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను తప్పుద్రోవ పట్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఉద్రేకపరచడం, చాలా ప్రమాదం.. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మనం అనుసరిద్దాం.....

మిత్రులారా మేల్కొనండి.. వదంతులు తప్పుడు సమాచారాలు నమ్మకండి.. ప్రచారం చేయకండి.. వివేకంతో ,బాధ్యతగా మెలుగుదాము..

 

ప్రజలు ఈ వదంతులను నమ్మడం వల్ల వారికి నష్టం కలగడంతో పాటు ఇతరులకు కూడా నష్టం చేసే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా గురించి తప్పుడు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. అందువల్ల సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలుసుకుంటే మంచిది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: