అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా తయారయిపోయింది సమాజం. ఎక్కడో.. ఏదో... జరిగిపోయినట్టుగా అది వాళ్ళు కళ్లారా చూసినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ గందరగోళం సృష్టించేవారి సంఖ్యకు కొదవేమి లేదు. అసలు సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తరువాత ప్రతి ఒక్కరి చేతికి మీడియా వచ్చేసినట్టుగా తయారయిపోయింది పరిస్థితి. ఎవరికీ తోచింది వారు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ లైక్ లు, కామెంట్స్, షేర్ ల కోసం ఆరాటం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవ్వడంతో ప్రపంచం అంతా గడగడలాడిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను ఈ కరోనా అల్లాడిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కు మందు కనిపెట్టలేదు. కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

 

IHG'vaccinates' players against fake news

ఇదే సమయంలో కరోనా గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు పోస్టింగ్స్ పెడుతూ కరోనా వైరస్ కు సంబందించిన న్యూస్ ను వైరల్ చేస్తున్నారు. దీంతో జనాల్లో ఎక్కడలేని గందరగోళం నెలకొంది. అసలు ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి సోషల్ మీడియా పుణ్యమా అంటూ నెలకొంది. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న విషయాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడమే బెటర్.

 

IHG


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని విషయాలను పరిశీలిస్తే... అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ, J D లక్ష్మీనారాయణ గారి వాయిస్,.ఇటలీ లో ట్రక్కులో కుప్పల శవాలు,. jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి, డాక్టర్ దంపతుల మరణం, రష్యా 500 సింహాలు రోడ్లపై వడలడడం, కరోనా వైరస్ కు dr గుప్త మందు, రోడ్ల పైన పడి ఉన్న దేహాలు, dr నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన, COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు,.ఆవుకు పుట్టిన మనిషి, మోదీ గారి 1000 GB ఫ్రీ, .బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు లాంటి తప్పుడు వార్తలతో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటువంటి ఇపత్కర పరిస్థితుల్లో జనాలకు మేలు చేసే, జాగ్రత్తలు చెప్పినా ఫర్వాలేదు కానీ ఇలా లేనిపోని అసత్య కథనాలు ప్రచారం చేయడం వల్ల సమాజానికి కీడు ఎక్కువ చేస్తాయి. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: