దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 27 వేలమంది మృతి చెందారు. 6 లక్షలమందికిపైగా ఈ కరోనా భారీన పడి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ కరోనా దెబ్బతో ఎక్కడిక్కడ ఆగిపోయాయి. 


 
వచ్చేనెల 14 వ తేదీ వరుకు ప్రజలంతా ఇంటి నుండి బయటకు రాకూడదు అని లాక్ డౌన్ చేసేశారు. ఇంకా అలాంటి ఈ సమయంలో ఎగుమతులు.. దిగుమతులు కూడా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి మోపిదేవి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా చేపలు, రొయ్యల వంటి ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఇబ్బంది లేకుండా చేసినట్టు అయన చెప్పారు. 


 
ఆక్వా ఉత్పత్తులపై కరోనా ప్రభావం పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి మోపిదేవి వెంకట రమణరావు తెలిపారు. వైరస్‌, ఇతర ఇబ్బందులు లేకపోతే తొందర పడి చెరువుల నుంచి పంటను తీయొద్దని మంత్రి రైతులకు సూచించారు. ఆక్వా రైతుల సమస్యలపై సంబంధిత అధికారులు, ఉత్పత్తిదారులతో శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆక్వా ఉత్పత్తుల ధరలు ఫిక్స్ చేసినట్టు అయన చెప్పారు. 


 
అంతేకాదు ఈ కరోనా వైరస్ కారణంగా మిగతా నిత్యావసరాల ధరలు కూడా భారీగా పడిపోయాయి అని అయన చెప్పుకొచ్చారు. మధ్యవర్తి ఇన్వాల్వ్ మెంట్ లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయనున్నట్టు అయన ప్రకటించారు. ఆక్వా దిగుమతులు ఆగకుండా ధరలు నిర్ణయించినట్టు అయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఏప్రిల్ 14 వ తేదీ వరుకు ఆక్వా దిగుమతులు ఎక్కడ ఆగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు అయన ప్రకటించారు. రైతుల నుండి నేరుగా ఈ ఫిక్స్డ్ ధరలకే కొనుగోలు చేస్తున్నట్టు మోపిదేవి చెప్పారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: