క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. దీంతో అక్క‌డ పరిశోధనల్లో `కరోనావైరస్‌`గా గుర్తించారు. ఇక అప్ప‌టి నుంచీ ఈ వైర‌స్ ఏ రేంజ్‌లో విస్త‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను స‌ర్వ నాశ‌నం చేస్తోంది.

 

గురువారం ఒక్కరోజే ఏకంగా 16,877 కేసులు నమోదుతో బెంబేలెత్తిపోయింది. మరణాల సంఖ్య 1400 దాటిపోగా.. కేసులు 93 వేలు దాటిపోయాయి. వారం క్రితం ఇవి కేవలం 8 వేలే. ఇంత తక్కువ వ్యవధిలో 11రెట్లు పెరిగిపోతాయని ఊహించలేదని, వ్యాధి మూడో దశను కూడా దాటిపోతోందని ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వెల్ల‌డించారు. అయితే ఇప్ప‌ట‌కీ కేవ‌లం 1800 మంది మాత్ర‌మే కోలుకోవ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా కేసుల్లో చైనా, ఇటలీలను అమెరికా దాటేసింది. న్యూయార్క్, వాషింగ్టన్‌లలో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికానే వరల్డ్ టాపర్‌ అయింది. 

 

అలాగే చికాగో, డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్‌లలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమ వద్ద తగినంత వైద్య వనరులు లేవని దేశవ్యాప్తంగా 213 నగరాల మేయర్లు చేతులెత్తేశారు. బాధితులను రక్షించేందుకు అవసరమైన పరికరాలను పొందే మార్గం కానీ, సరఫరా కానీ లేదని పేర్కొన్నట్టు శుక్రవారం విడుదలైన ఓ సర్వే తెలిపింది. అలాగే ప్రజలు సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించినా, పెద్ద సంఖ్యలో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినా కూడా మరణాల సంఖ్య 80 వేలు దాటవచ్చు. ఎందుకంటే అక్క‌డ వ్యాధి తీవ్రత, వ్యాప్తి అలా ఉంది మరి. ఇక ఈ లెక్క‌లు బ‌ట్టీ చూస్తుంటే అమెరికా ఎంత డేంజ‌ర్‌లో ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: