కరోనా వైరస్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ కావటంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వైరస్ రాకుండా ఉండాలంటే గోమాత ఉచ్చ తాగండి అంటూ...లేకపోతే ఆవుపేడతో స్నానం చేయండి ఎటువంటి వైరస్ మీ దగ్గరికి రాదు అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే వేప చెట్టు కి ఐదు బిందెల నీళ్లు పోస్తే వేప చెట్టు, మీ దగ్గరికి కరోనా వైరస్ రాకుండా అడ్డుకుంటుందని ఆ చెట్టు లో అంత శక్తి ఉంది అంటూ కొంతమంది ఆకతాయిలు ఫేక్ మెసేజ్ లు స్ప్రెడ్ చేసి ప్రజలలో భయాందోళనలు కలిగిస్తున్నారు.

 

ఈ విధంగానే ఇరాన్ దేశంలో కరోనా వైరస్ వల్ల చాలా మంది చనిపోతుంటే అక్కడ అధికారులకు ఏం చేయాలో తెలియని సందర్భంలో ప్రజలను గందరగోళానికి గురయ్యారు. దీంతో అదే టైంలో సోషల్ మీడియాలో మిథనాల్ తాగితే కరోనా వైరస్ రాకుండా వుంటుందని ఫేక్ చిట్కా బాగా ఇరాన్ దేశంలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఇరాన్ దేశ ప్రజలు ఆ చిట్కా విని నిజమే అనుకొని తమ ప్రాణాలను దక్కించుకోవడం కోసం మిథనాల్ నీ భారీ మోతాదులో తీసుకున్నారు. దీంతో ఆ దేశంలో ప్రజల 300 మంది చనిపోయారు. వెంటనే ఇరాన్ ప్రభుత్వం రంగంలోకి దిగి సోషల్ మీడియాలో ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని...కరోనా వైరస్ కి మందు లేదు..అందరూ ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు హెచ్చరికలు ఇచ్చారు.

 

భారతదేశంలో కూడా ఈ విధంగానే ఫేక్ చిట్కాలు సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ మనుషుల భయాలతో వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. దీంతో చాలామంది సమాజంలో చైతన్యం నింపే వాళ్ళు ఎలాంటి ఫేక్ మెసేజ్ లు స్ప్రెడ్ చేసి మనుషులి చంపకండి రా బాబు ఇంట్లో కూర్చొని లేకపోతే టీవీ చూసుకోండి, కామ్ గా ఉన్న మనుషుల్ని కంగారు పెట్టకుండా రా బాబు మీకు దండం పెడతాం అని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: