ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. అత్యంత వేగంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే అది మాత్రం కంట్రోల్ అయ్యే అవకాశాలు కనపడటం లేదు ఇప్పుడు. కరోనా వైరస్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తంగా దాదాపు 70 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణా లో కరోనా కేసులు 59 వరకు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 13 నమోదు అయ్యాయి. శుక్రవారం తెలంగాణాలో కరోనా కేసులు 10 నమోదు అయ్యాయి. 

 

వీరు అందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. వారి బంధువులకు కరోనా వైరస్ సోకింది. కుటుంబ సభ్య్యులకు కరోనా వైరస్ సోకడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. కఠినం గా లాక్ డౌన్ అమలు చేయడంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కాస్త అదుపులో ఉంది తెలంగాణా లో. విదేశాల నుంచి వచ్చిన వారికి ఇప్పుడు పరిక్షలు చేస్తున్నారు. తెలంగాణాలో కరోనా బారిన పడిన వారి ఆరోగ్య పరిస్థితి దాదాపుగా నిలకడగానే ఉందని అక్కడి ప్రభుత్వం చెప్తుంది. ఎవరికి ప్రాణాపాయం లేదని మంత్రి ఈటెల రాజేంద్ర చెప్పారు. 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉన్నతాధికారులతో కరోనా వైరస్ కట్టడి కోసం జగన్ సర్కార్ కఠిన చర్యలు అమలు చేస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాను సేకరిస్తుంది. వారిలో కొంత మందికి లక్షణాలు ఉండటంతో వారి నమూనాలను సేకరించి పరిక్షలు చేయిస్తున్నారు. మన దేశంలో కరోనా వైరస్ కేసులకు 900 కేసులు నమోదు అయ్యాయి. 20 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

 

ప్రపంచ వ్యాప్తంగా ఆరు లక్షల మంది కరోనా బారిన పడగా 27 వేల మందికి పైగా కరోనా కారణంగా మరణించారు. మన దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నమోదు అయ్యాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: