దేశంలో రాను రాను కరోనా వైరస్ బీభత్సం మరింత ఎక్కువగా సృష్టిస్తుంది.  కరోనా వ్యాప్తి చెందుకుండా కేంద్ర, రాష్ట్రాలు దేశ ప్రజలను ఇంటి పట్టున ఉండమంటున్న విషయం తెిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ చేుసిన విషయం తెలిసిందే.  అయితే ఎంత చెప్పినా కొంత మంది ప్రజలకు ఇప్పుడే డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డారు.  జనాల వీక్ పాయింట్ ని ఆసరగా చేసుకొని జనాల వద్ద డబ్బులు సంపాదించేందుకు కొంత మంది వ్యాపారాలు రంగంలోకి దిగారు.  కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేస్తూ కఠినంగా వ్యవహరిస్తోన్న పోలీసులపై కొందరు రాళ్లు రువ్వుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

 

తమ కుటుంబాలను వదిలి 24 గంటలూ పోలీసులు డ్యూటీలో ఉంటే వారిపై దౌర్జన్యాలకు దిగుగున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఈ విషయాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో చట్టాన్ని అమలు చేసేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ జనాలు గూమికూడకుండా, దుకాణాలు తెరవనీయకుండా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసోంలోని భావ్లాగురి బోది బజార్‌లో లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ కొందరు వ్యాపారులు తమ సొంత లాభాల కోసం దుకాణాలు తెరిచారు. 

 

లాక్ డౌన్ ఉన్న కారణంగా షాపులు మూసి వేయాలని పోలీసులు అడగడంతో అక్కడ కొంత మంది రెచ్చిపోయారు.  వ్యాపారులంతా కలిసి పోలీసులపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ ఆర్‌ఎస్‌ మిల్లీ తెలిపారు. అసోంలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయ్యింది.  ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేశారు.  కరోనా వల్ల ప్రమాదం ఉందని తెలిసి ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ అదికారులు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: