ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తోన్న క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో దాదాపుగా 200 దేశాలు గ‌జ‌గ‌జా వ‌ణికి పోతున్నాయి. ఇక ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌తో అగ్ర రాజ్యం అమెరికా చిగురు టాకులా వ‌ణికి పోతోంది. అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య ల‌క్ష‌కు దాటేసింది. ఇక మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా బాధితుల సంఖ్య 873కు చేరుకోగా.. క‌రోనా మ‌ర‌ణాలు 20 క్రాస్ అయ్యాయి. మ‌న దేశంలో గ‌త 24 గంట‌ల్లో ఏకంగా 149 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. కేర‌ళ‌లోనూ తొలి క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది.



ఇదిలా ఉంటే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య ఏకంగా ఆరు ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇక స్పెయిన్‌, అమెరికా, ఇట‌లీ లాంటి దేశాల్లోనే క‌రోనా కోర‌లు చాస్తోంది. ఇక క‌రోనా మృతులు ప్ర‌పంచ వ్యాప్తంగా 27 వేల‌కు చేరుకున్నారు. ఇక యూర‌ప్ ఖండంపై అయితే క‌రోనా మ‌రీ ప‌గ‌బ‌ట్టిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక మ‌న దేశంలో మ‌హారాష్ట్ర క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌లో తొలిస్థానంలో ఉంది. ఇక ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సైతం ఇప్ప‌టికే ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్ట్రిక్ట్‌గా లాక్ డౌన్ అమ‌లు అవుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: