ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కోరలు చాస్తూ దూసుకు పోతోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనాను కంట్రోల్ చేసేందుకు మ‌న దేశంలో ఇప్ప‌టికే లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమ‌లు అవుతోంది. ఇక క‌రోనా బాధితుల‌కు క్వారంటైన్ అమ‌లు చేస్తున్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారు క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు క్వారంటైన్‌లో ఉంటున్నా కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇందుకు స‌రికొత్త యాప్ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు బ‌య‌ట‌కు వ‌స్తే స‌మాచారం అందేలా కొత్త ప్లికేష‌న్ క‌ర్నూలు పోలీసులు అమ‌లు చేస్తున్నారు.

 


ఇందుకోసం అత్యాధునిక టెక్నాల‌జీ వాడుతున్నారు. క‌ర్నూలు ఎస్పీ ప‌కీర‌ప్ప ఈ యాప్ ఎలా ప‌ని చేస్తుందో ?  వివ‌రించారు. క్వారంటైన్‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి... వాళ్ల మొబైల్‌కు లింక్ పంపుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేసిన వెంట‌నే అక్క‌డ ఓ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. వాళ్లు ఇంటినుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే పోలీస్ కంట్రోల్ రూంతో అనుసంధానం అవ్వ‌డం వ‌ల్ల అక్క‌డ అలారం మోగుతుంది. వెంట‌నే పోలీసులు స‌ద‌రు బాధితుడి ఇంటికి వెళ్లి అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మో లేదా వార్నింగ్ ఇవ్వ‌డ‌మో చేస్తుంటారు.



దీనిని బ‌ట్టి క్వారంటైన్‌లో ఉన్న్ వాళ్ల‌కు ఇది త‌స్మాత్ జాగ్ర‌త్త అనాల్సిందే. ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్లినా వాళ్ల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు. ఇక క‌రోనా గురించి ఎప్ప‌టిక‌ప్పుడు లైవ్ అప్‌డేట్స్ ఫాలో అవుతూ ప‌ర్య‌వేక్ష‌ణ చేసేందుకు... నిరంతర ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఏపీ ప్ర‌భుత్వం క‌మిటీ ఏర్పాటు చేసింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: