దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి చేయడం విషయంలో  ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును గమనిస్తున్నా విషయం అందరికీ తెలిసినదే. ప్రతీ రాష్ట్రంలో మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు బులిటెన్ రెడీ చేస్తూ దేశ ప్రజలకు సమాచారాన్ని అందిస్తుంది. సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడుతున్నాయి అంటూ నేషనల్ మీడియా జగన్ ని ఆకాశానికెత్తేసింది.

 

 

దీంతో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పనితీరును గమనిస్తున్న నేషనల్ మీడియా..జగన్ గవర్నమెంట్ లో గ్రామ వాలంటీర్లు సూపర్ హీరోస్ అంటూ తాజాగా ఇటీవల కథనాలు ప్రసారం చేయడం స్టార్ట్ చేశారు. కరోనా వైరస్ రాష్ట్రంలో ఎవరికి వచ్చిందో రాలేదో ముందుగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పక్క సమాచారాన్ని ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడం, ఆ తరువాత కరోనా వైరస్ ఎక్కువగా విదేశాల నుండి వచ్చిన వాళ్ల వల్ల వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పసిగట్టిన జగన్...గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను ఇంటికి పరిమితం చేయటం అతిపెద్ద కీలకమైన పని. కానీ ఇక్కడే వైయస్ జగన్ సర్కార్ పాస్ అయిందని పొగుడుతున్నారు.

 

 

దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కట్టుదిట్టంగా సమర్థవంతంగా కరోనా వైరస్ ని ఎదుర్కొంటూ మంచి సత్ఫలితాలు సాధిస్తున్నారని పొగుడుతున్నారు. ఇదే తరుణంలో భారతదేశం కూడా ప్రపంచంలో పిలవబడే అగ్ర దేశాల కంటే ఎక్కువగా కరోనా వైరస్ ని ఎదుర్కొనడంలో సక్సెస్ అయిందని..ఖచ్చితంగా 21 రోజుల పాటు దేశ ప్రజలంతా ఈ విధంగానే ఇంటికి పరిమితమైతే….కరోనా వైరస్ ఎదుర్కొన్న విషయంలో ఇండియా ఇంటర్నేషనల్ స్థాయిలో విజేతగా నిలబడుతుందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: