జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మంచి సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల గురించి నేరుగా వచ్చి తెలుసుకోకుండా సోషల్ మీడియా ద్వారా గతంలో పోస్ట్ పెడుతూ చెప్పే అభిప్రాయాలను కూడా చెప్పకుండా పూర్తిగా మానేయటం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గతంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరుపై ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ అప్ డేట్ గా ఉండే వాళ్ళు. అయితే ఇటీవల బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చాలావరకు రాజకీయాలలో యాక్టివ్ గా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

 

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ప్రధాని 21 రోజులపాటు ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని లాక్ డౌన్ అమలులోకి తీసుకు రావడం జరిగింది. ఈ సందర్భంలో మాత్రం పవన్ కళ్యాణ్ ద్వారా మోడీ ప్రకటించిన వెంటనే సమర్థిస్తూ దేశ ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆర్బిఐ గవర్నర్ చెప్పిన ప్రకటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పవన్ కళ్యాణ్..రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ అరికట్టే మార్గాలను విషయములో మరియు ప్రభుత్వ పనితీరు విషయంలో మాట్లాడకుండా కామ్ గా ఉండటం పట్ల తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

 

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని భయంకరంగా రాజకీయంగా అనేక విమర్శలు చేసే నేతలు ప్రస్తుతం అంతా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉండటంతో...పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉండటంతో ఈ విషయం ఇప్పుడూ ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాలలో వైరస్ వ్యాపించకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలు...అభినందనీయం అంటూ దేశ స్థాయిలో ఉన్న ప్రముఖ నాయకులు పొగుడుతున్నారు.

 

దీంతో చాలా వరకు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కూడా సోషల్ మీడియా లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ విషయంలో ప్రభుత్వ పనితీరు విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఈ టైములో కేవలం ఇంటికి పరిమితం అయ్యి సైలెంట్ గా ఉండకుండా టైమంతా వేస్ట్ చేసుకోకుండా...సోషల్ మీడియా ద్వారా స్పందించాలని పొలిటిషన్ గా యాక్టివ్ గా ఉండాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: