ప్ర‌పంచ వ్యాప్తంగా  క‌రోనా క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ వ్యాధితో ఏమాత్రం అజాగ్ర‌త్త వ‌హించినా.. శుభ్ర‌త విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ప్ప‌టికీ వారు ఈ వ్యాధి బారిన ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను పాటించ‌క త‌ప్ప‌డం లేదు. ఇక ఇట‌లీ దేశంలో క‌రోనా కోర‌లు చాచిన విష‌యం తెలిసిందే. అక్క‌డి జ‌నాన్ని ఇది వెంటాడి మ‌రీ చంపుతోంది. ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన‌ప‌డి ఇప్ప‌టికే 2,500 మంది మృత్యువాత ప‌డ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రజలు పట్టించు కోకపోవడం వల్ల కొంత.. దీనితో, జస్ట్​ రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి భయంకరంగా మారిపోయింది. కేవ‌లం వీళ్ళ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే స్టేజ్ 3 నుంచి స్టేజ్ 6కి రావడానికి జస్ట్​ 5 రోజులే పట్టింది.

 


కరోనా కేసులున్నాయని తెలిసి ‘నాకేం అవుతుందిలే. నేనేమైనా ముస‌లోడ్నా లేక నాకేమైనా వైరస్ అంటడానికి.  అనుకుంటూ చాలా మంది బేఖాత‌ర్ చేసి రోడ్ల పైన తిరిగేశారు. రెడ్​జోన్లుగా ప్రకటించిన‌ప్ప‌టికీ, క్వారెంటైన్ అవుతున్నా భయపడలే. చనిపోతున్నది ముసలోళ్లే కదాని బయటకు వెళ్లడం మానలేదు.  అలాగే స్నేహితులను కలవడం కూడా ఎక్క‌డా ఆగ‌ లేదు. పావు వంతు దేశం మొత్తం బంద్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, రెడ్​జోన్లలో ఉన్న పదివేల మంది తప్పించుకున్నారు. ఇక అక్క‌డి ప్ర‌భుత్వం కరోనా వైరస్ గురించి సర్కార్ మాట్లాడడమే  తప్పించి ప్ర‌త్యేక జాగ్రత్తలు తీసుకున్నది లేదు. దీంతో ప్రభుత్వం హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించింది. 

 

హాస్పిటళ్లు నిండిపోయాయి. ఇక  ట్రీట్ మెంట్ చేసేందుకు డాక్టర్లు, నర్సులు సరిపోలేదు. ఇక చేసేదేముంది ఫలితంగా మరణాలు పెరిగిపోయాయి. ఇక రెడ్​జోన్ నుంచి పారిపోవ‌డ‌మే కాదు వారు ఆ పది వేల మందిని ఇటలీ మొత్తానికి వైరస్ అంటించేశారు. ఇక ఆ దేశం ఎకానమీ నష్టపోవద్దన్న ఉద్దేశంతో కొన్ని షాపులు, బార్లు, రెస్టారెంట్లు , మెడికల్ హాళ్లు వీల‌యినంత వ‌ర‌కు కూడా అన్నింటినీ అలానే తెరిచి ఉంచారు. దాంతో ఎక్క‌డి జ‌నం అక్క‌డే బ‌య‌ట విచ్చ‌ల విడిగా తిర‌గ‌డంతో వాళ్ళు ఇలాంటి ఇబ్బందుల‌కు గుర‌వ్వ‌వ‌ల‌సి వ‌స్తుంది. ఇక‌ అదే అదునుగా ఇష్టమొచ్చినట్టు షాపింగ్ లు, బార్లలో తాగడం చేశారు.  ఇక వ్యాధి తీవ్ర‌త పెర‌గ‌డంతో దెబ్బ‌కి అన్నింటినీ బంద్ పెట్టేసింది. సర్కార్  సర్టిఫికెట్ ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా గ‌ట్టిగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

tinyurl.com/NIHWNgoogle

 

tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: