ప్రపంచం అంతా కరోనా భయంతో వణికి పోతుంటే ఇదే అదునుగా కొంత మంది ఆకతాయిలు చేస్తున్న అసత్య ప్రచారాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  ఇది అందరూ ధైర్యంగా కలిసి కట్టుంగా ప్రస్తుత ఉపధ్రవాన్ని ఎదుర్కొవాలని నేతలు, సినీ సెలబ్రెటీలు అంటున్నారు.  కానీ ఇప్పుడు కొంతమంది ఉన్మాదులు, శాడిస్టులు పనికట్టుకొని మరి సోషల్ మాద్యమాల్లో లేని పోని అపోహలు కల్పిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ భయాన్ని సృష్టిస్తున్నారు.  కరోనా వైరస్‌ గాలితో వచ్చే వ్యాధి కాదు. 

 


కరోనా వైరస్‌ ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో వస్తోంది.  కరోనా సోకిన వ్యక్తి నుంచి సంక్రమిస్తోంది. అని వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. గచ్చిబౌలిలో 1500 మందికి క్వారంటైన్‌ చేసేలా ఏర్పాటు చేశాం. 15 రోజుల్లోగా 1500 మందికి సరిపడా ఐసోలేషన్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఒక్క వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా లేదు అన్నారు.  కరోనాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 


విదేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా వ్యాపించింది. గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్‌ హాస్పిటల్‌ను కరోనా పేషెంట్ల కోసం కేటాయించాం.  ఎయిర్‌పోర్టులో పనిచేసే వారికి కూడా కరోనా వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో రెడ్‌ జోన్లు లేవు. హైదరాబాద్‌లో రెడ్‌ జోన్లు ఉన్నాయన్న వార్తలు అవాస్తవం.  కరోనాపై కొంత మంది సైకోలు, శాడిస్టులు పెట్టే అసత్యవార్తలను నమ్మొద్దు. అని మంత్రి కోరారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 


apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: