నిన్నమొన్నటి వరకు అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పుకునే నగరాలలో మరణ కేకలు పుట్టించింది కరోనా వైరస్. అగ్రరాజ్యం అమెరికా మరియు అభివృద్ధి చెందిన ఇటలీ మరియు స్పెయిన్ దేశాలు కరోనా వైరస్ ముందు నిలబడలేక పోతున్నాయి. ఈ వైరస్ కి మందు లేకపోవటంతో నివారణ చేయాలంటే కచ్చితంగా దేశం మొత్తం షట్ డౌన్ లేకపోతే లాక్ డౌన్ ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉండటంతో చాలా దేశాలు ఈ విధానాలను అమలులోకి తీసుకు వచ్చిన అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఇంకా తీసుకురాలేదు. ఇటువంటి తరుణంలో చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ గురించి ఆ దేశంలో ఉన్న శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం సిగరెట్లు తాగేవారికి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

 

కోవిడ్ 19 వైరస్ ప్రభావం మొత్తం ఊపిరితితులపై ఉండటంతో అదే టైంలో పొగతాగే వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు పని చేసే విధానం డిఫరెంట్ గా ఉండటంతో ఛాతి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముందని హెచ్చరించారు. పొగతాగే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల వారిలో వైరస్ వ్యాపించే అవకాశాలు మిగతావారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మామూలుగా శుభ్రత కోసం ఊపిరితిత్తులు మ్యూకస్ పొర మందంగా ఉండటంతో వ్యార్థాలను బయటకు పంపేందుకు ఊపిరితిత్తులు కష్టపడతాయని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దక్కన్ బ్రాంచ్ సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్ సోకిన వ్యక్తి తాగే సిగరెట్ నీ షేర్ కొడుతూ మరొకరు తాగితే వ్యాధి వ్యాపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం చైనా దేశంలో ఈ వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నా, అమెరికాలో మాత్రం విస్తృత స్థాయిలో ఉంది.



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple









మరింత సమాచారం తెలుసుకోండి: