క‌రోనా వైర‌స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమ‌క్ర‌మంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో పాజిటివ్ కేసులు 59 కు చేరుకున్నాయి. ఇక ఏపీలో ముందుగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అంత‌గా లేదు అనుకున్నా ఇప్పుడు క్ర‌మ క్ర‌మ‌గా ఒక్కో కేసు విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే శ‌నివారంతో ఏపీలో పాజిటివ్ కేసులు 13కు చేరుకున్నాయి. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే వారిని సైతం ఏపీ పోలీసులు స‌రిహ‌ద్దుల వ‌ద్దే ఆపేస్తున్నారు. ఇక క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో చివ‌ర‌కు ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను సైతం క్వారంటైన్ చేస్తున్నారు.



తాజాగా గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మ‌హ్మ‌ద్ ముస్త‌ఫాను సైతం క్వారంటైన్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఆయ‌న బంధువులు క్వారంటైన్‌కు వెళ్లారు. ఇటీవ‌లే వారు ఎమ్మెల్యేను క‌ల‌వ‌డంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల నేప‌థ్యంలో చివ‌ర‌కు ఎమ్మెల్యేను సైతం క్వారంటైన్ చేయక త‌ప్ప‌లేద‌ని పోలీసులు చెపుతున్నారు. ఎమ్మెల్యే ముస్త‌ఫా కూడా పోలీసుల‌కు స‌హ‌క‌రిస్తూ క్వారంటైన్లో ఉంటూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.



ఇక ఏపీలో గుంటూరులో ఒకేసారి రెండు పాజిటివ్ కేసులు ఉండ‌డంతో గుంటూరులో ప్ర‌భుత్వ యంత్రాంగం ఒక్క‌సారిగా ఎలెర్ట్ అయ్యింది. అక్క‌డ ఎవ‌రైనా విదేశాల నుంచి వ‌స్తే వాళ్ల‌ను క్వారంటైన్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా అమ‌లు చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: