ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 28 వేల మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ నుంచి తమ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రముఖ క్యాబ్ సేవ‌ల సంస్థ ఓలా న‌డుం బిగించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు బ్లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇబ్బందుల్లో పడిన లక్షల మంది డ్రైవర్లను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. నిరుద్యోగులుగా మిగిలిపోయిన డ్రైవర్లతో పాటు... కుటుంబ పోషణ కోసం ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబాల కోసం రు. 20 కోట్లతో ఒక ప్రత్యేక నిధిని ప్రారంభించింది. 

 

ఈ విష‌యాన్ని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. స్వయంగా తన వార్షిక జీతాన్ని ఈ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నానని త‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాతలందించే  ప్రతీ చిన్న సహకారం మిలియన్ల కుటుంబాల శ్రేయస్సుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందనీ, ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ ఫండింగ్‌ను త్వ‌ర‌లోనే రు. 50 కోట్ల‌కు పెంచాల‌ని కూడా సూచించింది. 

 

త‌మ సంస్థ‌ను న‌మ్ముకున్న వారు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌నే ఇలా చేసిన‌ట్టు ఓలా తెలిపింది. త‌మ సంస్థ‌కు వెన్నుముక లాంటి తమ డ్రైవర్లు ప్రస్తుత  సమయంలో ఆదాయంలేక ఇబ్బందుల్లో పడ్డారని, వారిని ఆదుకునే లక్ష్యంతోనే సంస్థ ఈ నిధిని ప్రారంభించిందని ఓలా ప్ర‌తినిధులు తెలిపారు. ఓలా ప్ర‌పంచ వ్యాప్తంగా 20 ల‌క్ష‌ల మంది డ్రైవ‌ర్ల‌ను క‌లిగి ఉన్నారు. ఈ క్ర‌మంలోనే మిగిలిన సంస్థ‌లు కూడా ఓలాను ఆద‌ర్శంగా తీసుకుంటే త‌మ ఉద్యోగుల‌ను ఆదుకున్న‌ట్లు అవుతుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: