కరోనా వైరస్ బారి నుండి మన దేశాన్ని కాపాడుకోవడానికి ప్రధాని మోదీ లాక్‌డౌన్ ప్రకటించి, ఏప్రిల్ 14 వరకూ బయకు రావొద్దని సూచించారు. దాని కోసం తిండీ తిప్పలూ మానేసి, నిత్యవసరాలు కొనుక్కోకుండా ఇళ్లలోనే ఉండిపోమని కాదు. ఐతే మహారాష్ట్రలో ఈ విషయంపైనే పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ పెరిగి, అది చంపుకునేంత వరకు దారి తీసింది.

 

 

వివరాల్లోకి వెళ్తే, ముంబైలో నివసించే దుర్గేష్ ఠాకూర్ తన తమ్ముడితో కలిసి ఒకే ఒంట్లో ఉంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా అతను బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఇంతలో అతని తమ్ముడు, తమ్ముడి భార్య నిత్యవసర సామాన్ల కోసం ఇంట్లో నుండి బయటకు వెళ్లసాగారు. అప్పుడు అన్న వారిని వెళ్లొద్దని వారించాడు. కానీ సరుకులు తీసుకుని ఇప్పుడే వచేస్తామని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు.

 

 

దాదాపు రెండు గంటల తర్వాత వాళ్లిద్దరూ సరుకుల సంచులు మోసుకుంటూ ఇల్లు చేరారు. ఆలస్యం చేసినందుకు అన్నయ్యకు కోపం వచ్చి, వాళ్ళను ఇంటి బయటే నిలబెట్టి నిలదీశాడు. దుకాణాలు తక్కువగా, జనం ఎక్కువగా ఉండడంతో ఆలస్యమైందని చెప్పి తమ్ముడు గట్టిగా తుమ్మాడు. దాంతో అన్న అతడిని ఇంట్లోకి రావొద్దని ఖరాకండీగా చెప్పేసాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ఇద్దరూ విపరీతంగా దెబ్బలాడుకున్నారు. బాగా కోపంలో అన్న, వంటింట్లోకి వెళ్లి పాత కత్తి ఒకటి తెచ్చి, తమ్ముడి కడుపులో పొడిచాడు. అంతే అతను అక్కడిక్కడే కింద పడిపోయాడు. ఇరుగు పొరుగు వారందరూ పరిగెత్తుకొచ్చారు.  వేగంగా అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ దారిలోనే అతను చనిపోయినట్లు డాక్టర్ తేల్చారు. అలా పరోక్షంగా లాక్ డౌన్, ఒక కుటుంబంలో కలహాన్ని రేపి, కన్నీరు మిగిల్చి, జీవింతాంతం ఆ అన్నకు పశ్చాత్తాపాన్ని మిగిల్చింది.           

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

applehttps://tinyurl.com/NIHWNapple           

 

మరింత సమాచారం తెలుసుకోండి: