కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలలో విజ్ర్రంభిస్తున్న తరుణంలో వివిధ రాష్ట్ర, దేశ ప్రతినిధులు దాన్ని అరికట్టుటకు తగిన కట్టు దిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ రోజురోజుకీ.. ఘడియ ఘడియాకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే వుంది తప్ప, తగ్గడం లేదు. ఈ స్థితి వలన ప్రజలు అనుక్షణం ఇళ్లల్లో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇక బయటకు వస్తే లాక్ డౌన్ పరిస్థితి. ఎవరికి వారు టీవీలకు, సెల్ ఫోన్స్ కు అతుక్కుపోతూ కరోనా అప్ డేట్స్ తిలకిస్తూ ఉన్నారు.

 

ప్రస్తుతానికి, ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే కరోనా బాధితుల సంఖ్య 605314 కు చేరుకుంది. అందులో ఇప్పటివరకు 27610 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇక కోలుకున్నవారి సంఖ్య ఇప్పటివరకు 134074 గా తెలుస్తుంది. భారత దేశంలో కరోనా వైరస్ కేసులకు 944 కేసులు నమోదు అయ్యాయి. 20 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం పలువురు బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

 

ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి గనక గమనించినట్లయితే, క్రమంగా కరోనా విస్తరిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇరు రాష్ట్రాల్లో దాదాపు 72 కేసులు నమోదు అయినట్లు వినికిడి. తెలంగాణా లో 59 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో 13 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు మనదగ్గర కరోనా బాధితులందరూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇక క్లిష్ట తరమైన లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ కాస్త నెమ్మదించిందనే చెప్పుకోవాలి.

 

వైరస్ కట్టడి కోసం ఇరు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను మెచ్చుకుని తీరాల్సిందే. ఏపీలో జగన్ ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఇంటినుండి సర్వేలు చేపడుతూ, విదేశాలనుండి వచ్చిన వారి జాబితాలను పడే పడే పరిశీలించి, అక్కడ వున్న స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విధి విధానాల గురుంచి అందరికి విదితమే.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: