ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కరోనా భారీన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. కరోనాకు మందు కనిపెట్టడానికి ప్రపంచంలోని అన్ని దేశాల శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎన్ని నెలలు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అమెరికా శాస్త్రవేత్తలు పేషెంట్ల రక్తంతో కరోనా మహమ్మారిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే కరోనా సోకి తగ్గిపోయిన వారి రక్తాన్ని తాత్కాలిక మందుగా ఉపయోగించవచ్చని అంటున్నారు. 
 
శతాబ్దాల క్రితం ఇలాంటి వైరస్ ల భారీన పడిన సమయంలో కోలుకున్న పేషెంట్ల రక్తాన్ని రోగులకు ఎక్కించి వ్యాధులను నయం చేశారని వైద్యులు చెబుతున్నారు. పేషెంట్ల రక్తం ద్వారా తాత్కాలిక చికిత్సలు చేసి సులభంగా ప్రాణాలను కాపాడవచ్చని ... ఫ్లూ, మీజిల్స్, న్యూమోనియా లాంటి వ్యాధులన్నీ ఇలాంటి చికిత్సల ద్వారా నయమవుతాయని అంటున్నారు. 
 
ఎబోలా, సార్స్ వంటి వైరల్ రోగాలను అరికట్టడంతో ఈ ట్రీట్ మెంట్ మంచి ఫలితాలను ఇచ్చిందని చెబుతున్నారు. సాధారణంగా మానవ శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే రోగ నిరోధక వ్యవస్థ యాంటీ బాడీస్ ను తయారు చేసి వైరస్ లను నాశనం చేస్తుంది. యాంటీ బాడీలు సమర్థంగా ఉత్పత్తి అయిన వారు వైరస్ నుండి సులభంగానే కోలుకుంటారు. వారి రక్తంలో కొన్ని నెలల వరకు వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలు ఉంటాయి. 
 
ఆ పేషెంట్ల నుంచి ప్లాస్మాను సేకరించి కరోనా రోగులకు ఎక్కిస్తే వారు ప్రాణాపాయం నుంచి కచ్చితంగా బయటపడతారని జాన్స్ హాప్కిన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ కు చికిత్సకు ఆమోదం తెలపాలని లేఖ రాయగా రెండు రోజుల క్రితం లేఖ ఆమోదం పొందింది. అమెరికాలో ఇప్పటివరకూ 1,00,000 మంది కరోనా భారీన పడగా వీరిలో 1500 మంది మృతి చెందారు.   

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: