కరోనా వైరస్ ప్రభావంతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలు ఈ విపత్తు నుంచి ఎప్పుడు బయట పడదామా అన్నట్టు గా ఎదురు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ ను కంట్రోల్ చేసే మందు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ వైరస్ కారణంగా 190 దేశాలు సతమతం అవుతున్నాయి. ప్రజలు, ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందుల్లో కి వెళ్ళిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో జనాలు మొత్తం ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ వైరస్ ప్రభావం చాలా దేశాల్లో చేయి దాటిపోయింది. ప్రపంచ దేశాలకు పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్న అమెరికాలోనూ కరోనా వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో విస్తరించింది. ఇక భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం ఉన్నా, మిగతా దేశాలతో పోలిస్తే  మనదేశంలో కాస్త అదుపులోనే ఉన్నట్టు గా కనిపిస్తోంది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నా, మిగతా దేశాలతో పోల్చితే కాస్త తక్కువగానే ఉన్నాయి.

 


 ఇది ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావంతో రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు జనాల మధ్య తిరుగుతూ గుంపులు గుంపులుగా కార్యకర్తలను వేసుకుని హడావుడి చేసే నాయకులు ఇప్పుడు పూర్తిగా ఇళ్లకే పరిమితం అయిపోయారు. తెలంగాణలోనూ నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టుగా  సీఎం కేసీఆర్ దృష్టికి రావడంతో నాయకుల తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని గెలిపించింది ఇందుకేనా ? ప్రజల కోసం మీరు పని చేయరా ?  విపత్తు సమయంలో ఈ విధంగానేనా వ్యవహరించేది అంటూ కేసీఆర్ ప్రజాప్రతినిధులకు గట్టిగా క్లాస్ పీకడంతో వారంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. కొంతమంది కెసిఆర్ ఆగ్రహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి  కరోనా వైరస్ ప్రభావం పడకుండా ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు.

 

IHG


 మరికొంత మంది మాత్రం కరోనా భయంతో ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. జనాల్లో తిరిగితే తమ చుట్టూ ప్రజలు చేరతారని, ఆ సమయంలో ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ద్వారా తమకు కూడా ఆ వైరస్ సోకితే పరిస్థితి ఏంటి అని అధినేత ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఇళ్లకే పరిమితం అయిపోగా, మరికొందరు మాత్రం క్షేత్ర స్థాయిలో తిరుగుతూ భయం భయంగా ఇళ్లకు వెళ్తున్నారు. సోషల్ మీడియాలో  కరోనపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పోస్టులను షేర్ చేస్తూ తాము కష్టపడుతున్నాము అనే సంకేతాలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: