ఇప్పుడు భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పట్లో తన ప్రభావం తగ్గించేలా లేదు. అయితే భారతదేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారంతా విదేశాల నుండి ఇక్కడికి వచ్చిన భారతీయులో లేదా విదేశాల నుంచి వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారే. అంతే కాకుండా వివిధ దేశాల నుంచి భారత్ కు వచ్చిన వారిపై నిఘా పెట్టాలని కేంద్రం అన్నీ రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 

ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన లిస్టు ప్రకారం జనవరి 18 నుండి మార్చి 23 వరకు విదేశాల నుండి భారత దేశంలోకి అడుగు పెట్టిన వారి సంఖ్య 15,000. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు వీరి సమాచారం మొత్తం కేంద్ర ప్రభుత్వం అందించగా వారిలో 453 మంది విదేశీయులు ఏపీ లో కనపడకుండా పోయారు. అసలు వారి ఆచూకీ లభించకపోగా వారంతా ఏమయ్యారు.... ఎక్కడికి వెళ్లారు అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనిపై అధికారులతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన చెందుతూ ఉండగా విదేశాల నుండి విశాఖపట్నానికి వివిధ మార్గాల్లో వచ్చిన వారి వివరాలు జిల్లా అధికారులు సేకరిస్తున్నారు.

 

ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మొత్తం 3746 మంది విదేశాల నుండి విశాఖకు వచ్చారని ప్రకటించగా వారందరినీ క్వారంటైన్ పీరియడ్ గా 14 రోజులు ఇంట్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అయితే శుక్రవారం మీడియాకు వెల్లడిస్తూ 2795 మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చారని వారంతా హోమ్ క్వారంటైన్ లో వున్నారని పేర్కొన్నారు. వారిలో 28 రోజులు పూర్తయినవారు 137 మంది - 15-27 రోజులు పూర్తయినవారు 999 మంది - 14 రోజులలోపు వారు 1498 మంది వున్నారని వివరించారు. కానీ మిగిలిన  453 మంది ఎక్కడున్నారో తెలియడం లేదు అని జిల్లా కలెక్టర్ తెలిపారు.

 

కొంతమంది పాస్ పోర్టుల్లో ఇచ్చిన అడ్రెస్సుల్లో లేకపోగా….  విదేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా వుంటే...స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు తెలిపాలని  - ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: